Sai Pallavi: 8 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో సాయిపల్లవి రొమాన్స్.. ఎట్టకేలకూ కనికరించిందా?

ఇటీవల కొన్ని రోజులు నుంచి నార్త్ టు సౌత్ ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా చాలా మంది హీరోయిన్స్ పేర్లు ఉండొచ్చు కానీ వారి అందరిలో భిన్నంగా వైరల్ అయ్యిన హీరోయిన్ మాత్రం ఒకే ఒక్క హీరోయిన్ ఉందని చెప్పాలి. కాగా ఆ మిగిలిన హీరోయిన్స్ అంతా తమ హాట్ షోలు గ్లామర్ రోల్స్ తో వైరల్ అయితే అవేవి లేకుండానే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇపుడు వైరల్ అయ్యింది.

అయితే ఓ పక్క సినిమాలు మరో పక్క ఊహించని విధంగా కాంట్రవర్సీలో సాయి పల్లవి ఇరుక్కుంది. దీనితో ఇలా రెండు రకాలుగా కూడా సాయి పల్లవి పేరు మారు మోగగా రీసెంట్ గా సాయి పల్లవి నటించిన సినిమా "అమరన్" తో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఆమె మారిపోయింది. ఈ సినిమాలో కూడా సాయి పల్లవి హీరోని డామినేట్ చేసింది అంటూ టాక్ స్టార్ట్ అయ్యింది.

Is sai pallavi to romance with Dulquer Salmaan after 8 years

అయితే మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే సాయి పల్లవి లైనప్ కోసం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పాలి. కొందరు హీరోయిన్స్ డబ్బులు కోసమో లేక ఎక్కువ సినిమాలు చేయాలనో వరుస ఆఫర్స్ చేసేస్తూ ఉంటారు. కానీ సాయి పల్లవి మాత్రం ఈ పంథాకి పూర్తి విరుద్ధం. ఆమెకి ఎన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ కానీ కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఎంచుకుంటుంది.

ఇలా తక్కువ సినిమాలే ఆమె చేసినప్పటికీ మంచి గుర్తుండిపోయే పాత్రలు సాయి పల్లవి చేసింది అని చెప్పొచ్చు. అందుకే తన కెరీర్లో చాలా తక్కువ ప్లాప్ లు మాత్రమే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ ప్లాప్ లలో కూడా సాయి పల్లవి డిజప్పాయింట్ చేసింది కూడా ఉండదు. మరి సాయి పల్లవి ఇపుడు వరకు తెలుగు, తమిళ్, మలయాళ హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే.

Is sai pallavi to romance with Dulquer Salmaan after 8 years

అయితే మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత ఓ మలయాళ హీరోతో మరోసారి రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ హీరో ఎవరో కూడా కాదు మొన్న సాయి పల్లవి అమరన్ తో పోటీకి వచ్చిన లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్ తో అట. మరి సాయి పల్లవి దుల్కర్ తో ఎపుడో 2016 లో 'కాళీ' అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో తెలుగులో కూడా 2017లో విడుదల అయ్యింది. కానీ తెలుగులో అంతగా ఆడలేదు.

అయితే ఇపుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దుల్కర్ సరసన నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దుల్కర్ తో అప్పటి సినిమాలోనే మంచి పెయిర్ గా వీరిది కనిపించింది. కాగా ఇపుడు దుల్కర్ చేయనున్న అప్ కమింగ్ సినిమాలో అయితే ఈమె తనతో రొమాన్స్ చేయనుందట. కాగా ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఐతే సాయి పల్లవి తెలుగులో తండేల్ హిందీలో రామాయణం అనే భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

More from Filmibeat

Read more about: sai pallavi amaran lucky baskhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X