సైఫ్ ఆలీ ఖాన్‌పై దాడి వెనుక పలు అనుమానాలు.. ఆ మాఫియా డాన్ హస్తముందా?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దాడికి ముందు ఆ తర్వాత జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. ఈ దోపిడికి వచ్చిన వ్యక్తికి సంబంధించిన దాడి కాదనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కృష్ణ జింకల కేసులో సైఫ్ ఆలీ ఖాన్ కూడా ప్రధాన నిందితుడిగా ఉండటంతో ఆ కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ దాడి వెనుక ఆ మాఫియా డాన్ హస్తం ఉందా? అనే వాదన మొదలైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
హై సెక్యూరిటీ ఉన్న సైఫ్ ఆలీ ఖాన్ ఇంటిలోకి దొంగ ఎలా ప్రవేశించాడనే అనుమానాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఇంటిలోకి ఓ అపరిచిత వ్యక్తి ఎలా ప్రవేశిస్తాడు? సెక్యూరీటీ కళ్లు గప్పి ఏకంగా తన కుమారుడు జైష్ గది వరకు ఎలా వెళ్లగలుగుతాడు? అనే ప్రశ్నలను కొందరు లేవనెత్తుతున్నారు. ఓ స్టార్ హీరో ఇంటిలో ఇలాంటి సెక్యూరిటీ వైఫల్యం వెనుక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇక సైఫ్‌పై ఎటాక్ జరిగిన సమయంలో కారు అందుబాటులో లేకపోవడంతో ఆయనను తన కుమారుడు ఇబ్రహీం ఆటోలో హాస్పిటల్‌కు తరలించారనే విషయం మరింత షాకింగ్‌గా మారింది. అయితే కారు రెడీగా లేకపోవడం.. డ్రైవర్ అందుబాటులో లేకపోవడమనే విషయాలు ఉద్దేశపూర్వకంగా జరిగాయా? లేక యాదృశ్చికమేనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌తోపాటు సైఫ్ ఆలీ ఖాన్, టబు, సొనాలి బింద్రే, నీలమ్ లాంటి తారలు ఉన్నారు. ఈకేసులో ఉన్న వారిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని లారెన్స్ బిష్ణోయి హెచ్చరించారు. అంతేకాకుండా వారికి సహకరించే వారిని కూడా వదిలిపెట్టేది లేదు. ఎవరైనా సరే శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. అయితే ఆ కోణంలో సైఫ్‌పై ఎటాక్ జరిగిందా? అనేది ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది.

ఇటీవల కృష్ణ జింకల వేటాడిన కేసులో ప్రధాన నిందితుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన సినీ పరిశ్రమలో అలజడి రేపాయి. ఆ ఘటన మరిచిపోకముందే ఇప్పుడు సైఫ్‌పై దాడి జరగడం మరింత ఆశ్చర్యంగాను, అనుమానంగా మారింది. అయితే ఇంటిలో మరమత్తులు చేస్తున్న సమయంలో ఇంట్లోకి వర్కర్లు వచ్చారనేది పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది. అయితే వర్కర్ల రూపంలో సైఫ్ ఇంటిలోకి మాఫియా టీమ్ సభ్యులెవరైనా ప్రవేశించారా? అనే డౌట్స్‌ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











