బెడ్ రూం సీన్లలో రెచ్చిపోయిన కరీనా..!
బాలీవుడ్ తార కరీనా కపూర్ నటుడు అర్జున్ రాంపాల్‌తో బెడ్ రూం సీన్లలో రెచ్చి పోయింది. హాట్ రొమాన్స్‌ను హాయిగా...తనివి తీరా ఎంజాయ్ చేసింది. చూసే వారికి మాంచి మూడ్ వచ్చేలా కేకలు పెట్టేసింది. ఇదంతా ఆమె ప్రస్తుతం నటిస్తున్న 'హీరోయిన్' అనే చిత్రంలో భాగం.
కరీనాతో హాట్ హాట్ రొమాంటిక్ సీన్లలో నటించిన అర్జున్ రాంపాల్...ఇంకా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేక పోతున్నాడట. నటనే అయినా ఆవిడతో గడిపిన క్షణాలు ఇంకా తన కళ్లముందు కదలాడుతున్నాయి అంటున్నాడు ఆ హీరో. మరి ఈ విషయం విని కరీనా రియల్ లైఫ్ ప్రియుడు సైఫ్ అలీ ఖాన్ ఎలా తట్టుకుంటున్నాడో? అంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో వస్తున్న 'హీరోయిన్' చిత్రంలో కరీనా టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. రంగుల సినిమా ప్రపంచంలో అందంగా మెరుస్తూ కనిపించే హీరోయిన్లు తెర వెనక ఎలాంటి పరిస్థితులును ఎదుర్కొంటారు? అనేది ఈచిత్రంలో చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications












