రజిని, సల్మాన్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Salman-Rajinikanth: రోజురోజుకు ఇండియన్ సినిమా స్వరూపం మారిపోతుంది. ఇటీవల పాన్ ఇండియా, గ్లోబల్ సినిమాలు అంటూ హద్దులు చెరిపేస్తున్నారు. దీంతో దీంతో బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ లో.. కోలీవుడ్ యాక్టర్స్ బాలీవుడ్ లో.. ఇలా నచ్చిన సినిమాలలో నటిస్తున్నారు. ప్రేక్షకులు కూడా నార్త్, సౌత్ సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ నచ్చితే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్టీ స్టారర్ మూవీస్ కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి నటించబోతున్నారట. కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ఇంతకీ ఆ మూవీ డైరెక్టర్ ఎవరంటే..

ఆ డైరెక్టర్ ఎవరో కాదు. సౌత్ ఇండియన్ ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు‌. సౌత్ లో ఎన్నో భారీ హిట్స్ ను తెరకెక్కించిన ఘనత ఆయన ఆ తర్వాత బాలీవుడ్ లోకి' జవాన్' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది . కలెక్షన్ల పరంగా సునామీ దీంతో డైరెక్టర్ అట్లీ పేరు నేషనల్ వైడ్ గా మారు మోగింది.

Is Salman Khan going to work with Rajinikanth in Atlee s next movie after Sikandar shoot

ఆ తర్వాత.. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా బేబీ జాన్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించారు. దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన తమిళ సినిమా తెరికీ హిందీ రీమేక్ ఇది. అయితే.. ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అందుకోలేదు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి.. ఘోర పరాజయం పాలైంది.

బేబీ జాన్' సినిమా పరాజయం తర్వాత డైరెక్టర్ అట్లీ కుమార్ మరో సినిమాతో రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ మల్టీస్టారర్ అని అంటున్నారు. అందులో ఓ హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తుండగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో హీరోగా నటించబోతున్నారట. దాదాపు సినిమా కోసం అట్లీ.. సల్మాన్ ఖాన్ తో ఏడాదిగా చర్చలు జరుపుతున్నారట. ఇటీవల అట్లీ మూవీకి సల్లూ భాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ తెరకెక్కించబోతుందట. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించారని పలు నివేదికలు పేర్కొన్నాయి.

ఇక సల్మాన్ ఖాన్ వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'సికందర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ యాక్షన్ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. సల్మాన్ ఖాన్ 'సికందర్' సినిమాను ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

మరోవైపు రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ ప్రస్తుతం 'కూలీ', 'జైలర్ 2' సినిమా షూటింగ్స్ ల్లో బిజీగా ఉన్నారు. ఇటు రజనీకాంత్, అటు సల్మాన్ ఖాన్ డేట్స్ బట్టి అట్లీ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నారట. మొత్తానికి ఈ ఏడాది చివరి నాటికి ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: atlee rajinikanth salman khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X