రాజమౌళి డైరక్షన్ మళ్ళీ ఆమె హీరోయిన్ ఐతే టాలీవుడ్ నెం.1 ఖాయం...!?

By Sindhu

మర్యాద రామన్న విడుదలయ్యాక..ఊపిరి తీసుకోవడానికి సైతం ఖాళీ లేనంత బిజీగా మారిపోతానని అంచనా వేసుకున్న సలోని, ఆ సినిమా విడుదలై వంద రోజులు కావస్తున్నా ఇంకా ఆమెను ఏ అవకాశం వరించకపోవడం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మర్యాద రామన్న" అనంతరం శివాజీ, కష్టుడు వంటి 'చోటా మోటా" మీరోల సరసన నటించే అవకాశమెంచ్చినప్పటికీ.. మరీ చిన్న సినిమాల్లో నటిస్తే..ఇక తనను మళ్లీ మందులాగే చిన్న చూపుచూస్తారనే భయంతో వాటిని అంగీకరించనందుకు ఇప్పడు సలోని తీరిగ్గా పశ్చాత్తాపపడుతోందని తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో తను రూపొందిస్తున్న ప్రయోగాత్మక చిత్రం 'ఈగ" లో మరొకసారి సలోనికి రాజమౌళి అవకాశమిచ్చే అవకాశముందని తెలుస్తోంది. గజాలా(స్టూడెంట్ నెం.1), అంకిత(సింహాద్రి) వంటి ఒకరిద్దరు హీరోయిన్లను మినహాయిస్తే రాజమౌళి చిత్రాల్లో నటించిన హీరోయిన్లంతా టాప్ పొజిషన్ లోనే ఉన్నారు. ముఖ్యంగా 'విక్రమార్కుడు" చిత్రంతో తన కెరీర్ లో మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసురున్న అనుష్క ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే..'మగదీర" ముందు వరకూ ఓ బి గ్రేడ్ హీరోయిన్ గా చలామణి అవుతూ వచ్చిన కాజల్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న సూపర్ హీరోయిన్.

ఈ నేపధ్యంలో తన ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సలోని కెరీర్ లో వెలుగులు వెదజల్లేందుకు రాజమౌళి నడుం కట్టే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒక వేళ కారణాంతరాల వలన 'ఈగ" లో అవకాశమివ్వలేకపోయినా..రాజమౌళి తన హీరోలెవరికైనా ఏ ఈగతోనో కబురు పెట్టించి సలోని కోసం చిన్న సిఫార్సు చేసినా ఆమె జాతకం ఉన్నపళంగా మారిపోవడం ఖాయం. ఎందుకంటే ఓ టాప్ హీరోయిన్ గా వెలుగొదడానికి అవసరమైన అన్నిక్వాలిటీస్ సలోనిలో పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు సినీ ప్రేక్షకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X