Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి లైఫ్ ఇచ్చాడు కానీ ఆమే పాడుచేసుకొంటోంది...
వైష్ణవి మూవీస్ పతాకంపై రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో నలుగురు అబ్బాయిలకు, ఓ అమ్మాయికి మధ్య జరిగే కథతో వస్తున్న చిత్రం 'తెలుగమ్మాయి". ఎం.ఎస్. నారాయణ కుమారుడు విక్రమ్, యశ్వంత్, సాయిచందు, శ్రీహర్ష హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయిగా సలోని నటిస్తోంది. ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశంలో వచ్చే 'పైరగాలి వచ్చి నన్ను పాట పాడమంది..రైలు కూత చేరి నన్ను రాగం తీయమంది"" అనే పాట చిత్రీకరణ ఇటీవల పూర్తియింది. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ఎంతో అందంగా తెరకెక్కించారట. కథ ప్రకారం గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సలోని వెలుతూ ఉండగా ఈ పాట వస్తుందట.
కాగా నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఎలాంటి గుర్తింపు రాని క్యూట్ హీరోయిన్ సలోని కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత రాజమౌళి మర్యాద రామన్న" తో రీ ఎంట్రీ ఇచ్చింది. సలోనిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించిన రాజమౌళి సినిమాలో ఆమెను చక్కగా ఉపయోగించుకున్నాడు. వీలైనంత ఎక్కువ అందంగా చూపించడానికి ట్రై చేశఆడు. రాజమౌళి కష్టానికి ఫలితం దక్కింది సినిమా సక్సెస్ కావడంతో సలోనికి కూడా మంచి పేరే వచ్చింది. అయితే ఆ పేరుని నిలబెట్టుకోవడంలో సలోని ఫెయిల్ అయిందనే చెప్పాలి. అంత మంచి సినిమా తర్వాత ఆమె చేస్తున్న తెలుగమ్మాయి సినిమాయే దానికి కారణం.
ఊరూ పేరు లేని హీరోల మధ్యలో ఒక హీరోయిన్ గా నటించడం ఒక కారణమైతే, ఔట్ డేటెడ్ డైరెక్టర్ రాజా వన్నెంరెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్ కావడం మరో కారణం. సలోనికి రాజమౌళి గుడ్ స్టార్ట్ ఇచ్చినప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా ఇలాంటి సినిమాలు ఒప్పుకోవడం వల్ల సలోని చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తోందనిపిస్తోంది. సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తే తప్ప సలోనికి భవిష్యత్తు వుండదు.