సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ తర్వాత అనూహ్య నిర్ణయం!
ఇండియన్ సినిమా రంగంలో కొద్దికాలంగా శోభితా దూళిపాల, నాగచైతన్య అక్కినేని ఎంగేజ్‌మెంట్ వ్యవహారం భారీ చర్చకు దారి తీసింది. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం.. వారి నిర్ణయానికి అక్కినేని, ధూళిపాల కుటుంబాల నుంచి ఆమోదం లభించడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో సమంత పెళ్లి విషయం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ వ్యవహారంగా మారింది. అ వివరాల్లోకి వెళితే...
నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంతకు సంబంధించిన వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. విడాకుల దారి తీసిన పరిస్థితులకు తనకెలాంటి సంబంధం లేదనే విషయాన్ని ఆమె ప్రస్తావించడంపై ఆమె అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. చైతూతో నిశ్చితార్థం తర్వాత శోభితా హాట్ వీడియోలను సమంత అనుకూల సోషల్ మీడియా వర్గాలు షేర్ చేస్తున్నాయి.

అయితే సమంత విడాకులకు కారణం.. ఐటెం సాంగ్స్, లేదా హాట్ సీన్లలో నటించకూడదు. అలాగే సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్స్ చేయకూడదనే ఆంక్షలు విధించడం ప్రధాన కారణమైందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.ఈ క్రమంలో సమంతకు సోషల్ మీడియాలో ఫుల్లుగా సపోర్ట్ లభిస్తున్నది.
ఇక ఇదిలా ఉంటే.. నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థం తర్వాత సమంత కూడా వివాహం చేసుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. విడాకుల సమయంలో తనకు అండగా నిలిచిన సన్నిహితులు, స్నేహితులు కూడా మ్యారేజ్ విషయంలో అండగా నిలిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఆరోగ్య సమస్యలను చక్కదిద్దుకొన్న సమంత ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. అయితే స్నేహితులు, సన్నిహితుల సూచన మేరకు ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఆమె త్వరలోనే తన పెళ్లి విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడే అలాంటి నిర్ణయం ఉండకపోవచ్చనే విషయం కూడా సన్నిహితులు వెల్లడిస్తున్నారు.
ఇదిలా ఉంటే..సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నది. ఈ సిరీస్ తర్వాత ఓ బాలీవుడ్ సినిమాకు, అలాగే మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలిసింది.


Click it and Unblock the Notifications











