NTR- Prasanth Neel Movie: స్టార్ హీరోయిన్‌తో ఐటెం సాంగ్.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా!
NTR- Prasanth Neel Movie: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ 'దేవర'. ఫస్ట్ షో నుండే పాటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతున్నది. ఇప్పటికే రూ.400 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన దేవర రూ.500కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ భారీ హిట్ తో పుల్ జోష్ లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా సెస్సేషన్ క్రియేట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మూవీని చేయనున్నాడు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ క్రేజీ కాంబో మూవీ నుంచి ఓ కిక్ ఇచ్చే న్యూస్ వైరలవుతోంది. మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి ఓ ఐటెం సాంగ్ ఫ్లాన్ చేస్తున్నారు. ఆ ఐటెం సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ నటించనున్నది.
సెస్సేషన్ క్రియేట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్, కేజీఎఫ్ లతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సరికొత్త హిస్టరీ రికార్డు చేశారు. ఆ తరువాత ప్రభాస్ సలార్ తో బంపర్ హిట్‌గా అందుకున్నారు. ఈ సన్సేషనల్ డైరెక్టర్
ప్రస్తుతం ఎన్టీఆర్‌తో మూవీని ప్లాన్ చేశాడు. అటు క్లాస్.. ఇటు మాస్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి భారీ ట్వీస్టులు, భారీ ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి ఓ స్టార్ హీరోయిన్ తో హాట్ ఐటెం సాంగ్ ను ఫ్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు. సమంత రూత్ ప్రభు. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు. తన అందం, అభినయంతో విమర్శకులను నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ తరుణంలో ఎన్నో అవార్డులను సైతం అందుకుంది సమంత. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. ఈ బ్యూటీ సినిమాల్లోనే కాదు. సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారినపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఆరోగ్యంపై పుల్ ఫోకస్ పెట్టింది. ఆ తరువాత టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ పై కన్నేసింది. వరుస సినిమాలు, సిరీస్ లలో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది సమంత. ఈ క్రమంలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రానున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందట. ఈ వార్త నిజమైతే.. ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ కానున్నది.

అంతకుముందు అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మూవీ పుష్ప 1 లో సమంత ఐటెం సాంగ్ పై హిటెక్కించే స్టెప్పులేసి మాస్ ఆడియన్స్ మెస్మారైజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదెలా ఉంటే.. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











