7 ఏళ్ల తరువాత స్టార్ హీరోతో సమంత రొమాన్స్.. ఈ జోడి కలిస్తే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే..
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస విజయాలను అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మారింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఓరియంటెడ్ కంటెంట్ తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా 'సిటాడెల్: హనీ బన్నీ'(Citadel: Honey Bunny) సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. హిట్ టాక్ అందుకుంది. ఈ జోష్ తో మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ ? ఓ లూక్కేయండి.
'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సమంత. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. పస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూవీ మేకర్స్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోల సరసన నటించి, అతి తక్కువ కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరుగా నిలిచారు.

మరోవైపు.. హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే.. వీరి వివాహం బంధం మున్నాళ్ల ముచ్చటగా మారింది. ఇరువురి మధ్య మనస్పర్థాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో ఇండస్ట్రీనే కాదు, మూవీ లవర్స్ కూడా ఫీల్ అయ్యారు. సమంత తన పర్సనల్ లైఫ్ లో ఓడిపోయినా.. తన ప్రొఫెషనల్ లైఫ్ లో జెట్ లా దూసుకెళ్తుంది. విడాకుల అనంతరం టాలీవుడ్ కు దూరంగా ఉంటూ బాలీవుడ్ దగ్గరైంది. వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది సమంత. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇదిలాఉంటే.. ఇదిలా ఉంటే సమంత తమిళ స్టార్ హీరో విజయ్‌తో మరోసారి నటించడానికి రెడీ అవుతుందట. గతంలో సమంత.. విజయ్ తో కలిసి మూడు సినిమాల్లో నటించింది. అవే.. కత్తి, తెరి, మెర్సల్ సినిమాలు. ఈ సినిమాల్లో విజయ్ సరసన నటించింది సమంత. మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. వీరిద్దరూ నటించిన ఏ సినిమా కూడా 1000 కోట్లు వసూలు చేయలేదు.

ఇక తాజాగా 4వ సారి దళపతి విజయ్ నటిస్తోన్న 69 సినిమాలో కూడా సమంత నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి హెచ్. వినోద్ దర్శకత్వం వహించనున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ సినిమానే చివరి సినిమా. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, నారైన్, ప్రియమణి, మమితా బైజు, మోనిషా బ్లెస్సీ నటిస్తున్నారు.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డెను తీసుకునట్టు తెలుస్తోంది. అయితే.. సినిమాలోని మెయిన్ రోల్ లో సమంతను తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయం అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటి వరకూ సమంతా, విజయ్ సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2025లో ఈ సినిమా విడుదల కాబోతుంది. రాజకీయ నేపథ్యం తెరకెక్కబోయే ఈ సినిమాలో విజయ్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 ఎన్నికలకు ఈ సినిమా విజయ్ కి ప్రచార వ్యూహం అవుతుందని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











