ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో సమంత ..ఆ ఒక్క ఫోటోతో బయటపడ్డ బంధం, మరో పెద్ద ఫ్యామిలీకి కోడలిగా?
ప్రస్తుతం టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగచైతన్య - శోభితలు త్వరలో వివాహం చేసుకుంటూ ఉండగా, నాగ్ చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని కూడా సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు. త్వరలోనే వీరి పెళ్లి కూడా గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్, తెలుగు ప్రజల చూపు అక్కినేని ఫ్యామిలీపై పడింది.
సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా లైఫ్ లీడ్ చేశారు నాగచైతన్య. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా తన సహనటి శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ తీసుకుని షాకిచ్చారు చైతూ. వీరిద్దరి బంధంపై ఎప్పటి నుంచో మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ జనం అంతగా పట్టించుకోలేదు, కానీ చివరికి అవే నిజమయ్యాయి. వీరి బంధాన్ని అధికారికంగా ప్రకటించారు నాగార్జున. తమ హీరో మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతుండటంతో అక్కినేని అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ తొలి వారంలో నాగచైతన్య - శోభితల వివాహం జరుగుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నాగచైతన్య మరో తోడు వెతుక్కుని జీవితంలో స్థిరపడుతుండగా.. మరి సమంత పరిస్ధితి ఏంటని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. చైతూతో డివోర్స్ తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి సమంత ఎంతో శ్రమించారు. కోయంబత్తూరులోని ఈషా ఆశ్రమంలో ఆధ్యాత్మిక సేవలో గడిపి డిప్రెషన్ నుంచి కోలుకున్నారు. ఇంతలో మయోసైటిస్ లాంటి అరుదైన వ్యాధి బారినపడిన సమంత చికిత్స తీసుకుని తిరిగి మామూలు మనిషిగా మారారు.
తిరిగి సినిమాలు , వెబ్ సిరీస్‌లతో బిజీ అవుతున్న సమంత రీసెంట్‌గా నవంబర్ 7న సిటాడెల్ హనీ బన్నీ అనే స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇలాంటి పరిస్ధితిలో నాగచైతన్య రెండో పెళ్లి విషయం బయటకు రావడంతో సామ్ ఎలా స్పందిస్తారోనని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఈ ఇష్యూని చాలా లైట్ తీసుకున్నారు. కాకపోతే ఇన్‌డైరెక్ట్‌గా నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదిలాఉండగా.. సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సామ్ లవ్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇది తర్వాత పుకారుగానే మిగిలిపోయింది. తాజాగా మరోసారి సమంత పర్సనల్ లైఫ్‌కు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామ్ ఓ బాలీవుడ్ స్టార్‌తో పీకల్లోతు ప్రేమలో పడ్డారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కుమారుడు , హీరో అర్జున్ కపూర్.
నిన్న మొన్నటి వరకు మలైకా అరోరాతో డేటింగ్ చేసిన అర్జున్.. ఇప్పుడు సమంతతో ప్రేమలో పడ్డాడని బీ టౌన్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల సమంత షేర్ చేసిన కవితకు అర్జున్ రిప్లయ్ ఇవ్వడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. దీంతో సమంతతో ఎలాంటి పరిచయం లేని అర్జున్ కపూర్ ఎందుకు రిప్లయ్ ఇచ్చాడు? వీరిద్దరి బంధం నిజమేనా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











