ఆ డైరెక్టర్‌తో సమంత అఫైర్ బట్టబయలు.. ఒక్క మెసేజ్‌తో డేటింగ్ లైఫ్ లీక్!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు డైవోర్స్ తీసుకొన్న తర్వాత ఆమెపై రకరకాల రూమర్లు, గాసిప్స్ మీడియాలో తరచు కనిపిస్తూనే ఉన్నాయి. ఫలానా బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నారని, లేదా ఫలానా డైరెక్టర్‌తో డేటింగ్ కారణంగా ఆమె వైవాహిక జీవితం కుప్పకూలిందనే వార్తలే కాకుండా ఇంకా చాలా రకాలుగా మీడియాలో వార్తలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా తనకు ఇష్టమైన డైరెక్టర్‌తో డేటింగ్ వ్యవహారం ఓ మెసేజ్‌తో బయటపడిందనే విషయాన్ని జాతీయ మీడియాకు చెందిన వెబ్‌సైట్స్ ప్రచురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్తలో వాస్తవం ఎంత? అనే వివరాల్లోకి వెళితే...
నాగచైతన్యతో సమంత విడాకులకు కారణం ఓ వెబ్ సిరీస్ డైరెక్టర్ అనే వార్త రెండు, మూడు సంవత్సరాలుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే అందుకు తగినట్టుగా ఆధారాలు లేకపోవడంతో ఆ వార్త కేవల రూమర్‌గానే మిగిలిపోయింది. ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు నిచ్చిన దర్శకద్వయంలో ఒకరితో సమంత చనువుగా ఉంటున్నారనే వార్త గురించి ఇప్పటికీ అప్పుడప్పుడు చర్చ జరుగుతున్నది.

అయితే ఇటీవల సమంత తమిళంలో గలాటా ఇండియా అనే మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో సదరు డైరెక్టర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. అయితే ఇంటర్వ్యూ మధ్యలో ఆ మెసేజ్ చూసిన ఆమె సంతోషంతో మునిగిపోయారు. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి అనే లెహ్రేన్ అనే వెబ్ సైట్ వార్తను కోట్ చేస్తూ ఓ వార్త కూడా మీడియాలో వైరల్ అవుతున్నది.
గలాటా ఇంటర్వ్యూ సమయంలో తన స్నేహితుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు సమాధానం ఇస్తున్న సమయంలోనే ఓ యువ డైరెక్టర్ నుంచి ఓ లవ్ మెసేజ్ వచ్చింది. ఆ ఆడియో మెసేజ్ చూడగానే ఆమె ఓ రకమైన ఫీలింగ్‌కు గురైంది అని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు కథనంలో వెల్లడించారు.

అయితే ఇంకా సమంత, సదరు డైరెక్టర్ గురించి ఇంకాస్త వివరాలు అందిస్తూ.. ఆ పాపులర్ వెబ్ సిరీస్ షూటింగులో వారిద్దరూ దగ్గరయ్యారు. వారి మధ్య విడదీయలేనంత అనుబంధం ఏర్పడింది. ఆ కారణంగానే చైతూతో విడాకులు జరిగాయి. అయితే ఆ డైరెక్టర్ ఇప్పటికే వివాహితుడు. కానీ సమంత కోసం ఆయన తన భార్యను వదులుకోవడానికి కూడా సిద్దంగా ఉన్నాడనే విషయాన్ని లెహ్రేన్ కథనంలో వెల్లడించారనే విషయాన్ని బాలీవుడ్ షాదీస్.కామ్ తన కథనంలో పేర్కొన్నది.
ఇదిలా ఉండగా, సమంత తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్‌పై స్పందిస్తారా? లేదా ఇలాంటి గాలివార్తలను పట్టించుకోకుండా వదిలేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. అయితే ఇటీవల కాలంలో సమంత, సదరు డైరెక్టర్ మధ్య డేటింగ్ లైఫ్ గురించి భారీగానే వార్తలు రావడంతో ఈ వార్త మరింత వారి రిలేషన్‌షిప్‌కు మరింత ఆజ్యం పోసిందనే విధంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











