నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంతపై పుకార్ల జోరు.. సార్ట్ డైరెక్టర్ తో డేటింగ్ అంటూ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య డివర్స్ ఇచ్చిన తర్వాత ఒంటరిగానే జీవితాన్ని లీడ్ చేస్తోంది సమంత. అయితే.. తాజాగా ఈ సార్ట్ హీరోయిన్ గురించి ఒక సంచలన విషయం తెర మీదికి వచ్చింది. ఆమె ఓ పాపులర్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో మీరూ కూడా ఓ లూక్కేయండి బాస్..
ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత అందరి దృష్టి హీరోయిన్ సమంతపై పడింది. చైతూ నిశ్చితార్థం తరువాత సామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అక్కినేని ఫ్యాన్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ వేచి చూస్తున్నారు. ఈ విషయంపై సామ్ ఎలా స్పందిస్తుందనీ, ఆమె ఏమైనా పోస్ట్ పెడుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, వారి ఎంగేజ్ మెంట్ పై సామ్ అసలూ స్పందించలేదు. ఆమె ఎలాంటి పోస్ట్, వీడియోలను కూడా షేర్ చేయలేదు. కానీ, ఇదిలా ఉండగా.. సమంత గురించి ఓ విషయం నెట్టింట తెగ వైరలవుతుంది. ఆమె ఓ బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నట్టు , ఆమె కూడా మరో త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నెట్టింట్టో ఓ రూమర్ వైరల్ అవుతుంది.

వాస్తవానికి ఒకప్పడు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీ కపుల్స్ సామ్ - చైతూ.. అసలూ ఏం జరిగిందో తెలియదు. కానీ, మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట కొద్ది రోజులకే విడిపోయింది. తాను ప్రాణంలా ప్రేమించిన సామ్ కు విడాకులు ఇచ్చాడు చైతూ. ఎప్పటికైనా తమ డిసీషన్ మార్చుకుని ప్యూచర్ లోనైనా కలువబోతారా..? అని ఆశించినా అక్కినేని ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ఎవరూ ఊహించని విధంగా నాగచైతన్య ఇటీవల శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో మ్యారేజ్ డే ను కూడా ప్రకటించనున్నారు.
ఈ సందర్భంలో నాగచైతన్య కొత్త జీవితాన్ని ప్రారంభించడం పట్ల సమంత ఎలా రియాక్ట్ అవుతోందనని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కానీ, సామ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. తన హెల్త్ , కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ, తాజాగా సమంతకు సంబంధించి ఓ సంచలన విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఆమె పాపులర్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది.

ఇటీవల వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమంత.. డైరెక్టర్ రాజ్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందనీ, వారిద్దరూ గత కొంత కొద్ది రోజుల నుంచి సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతకాకుండా ఈ జంట త్వరలోనే ఎంగ్మేజెంట్ చేసుకోబోతున్నారని, త్వరలోనే మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారనే రూమార్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ మరో షాకింగ్ ఏంటంటే.. డైరెక్టర్ రాజ్ కి ఇప్పటికే శ్యామాలి అనే అమ్మాయితో వివాహమైంది. కానీ, హీరోయిన్ సమంతతో ప్రేమలో పడటంతో ఆ డైరెక్టర్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని టాక్. ఇక్కడ మరో చిన్న విషయం.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత బర్త్ డే సెలబ్రేషన్ ను ఓ రేంజ్ లో చేశారు రాజ్ డీకే టీం. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియోలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజ్ డీకే దర్శకత్వంలోనే సమంత సిటాడెల్ హనీ బన్నీ అని ఒక వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదిఏమైనా ప్రస్తుతం వైరలవుతున్న ఈ రూమర్స్ లో నిజమెంత అనేది వారే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది


Click it and Unblock the Notifications











