సమంతతో ఆ బంధానికే రాజ్ నిడిమోరు మొగ్గు.. రెండో పెళ్లికి అదే అడ్డంకా?

సౌత్ ఇండియాలో అగ్ర నటి సమంత రుత్ ప్రభు రెండో పెళ్లి వ్యవహారం మీడియాను అత్యధికంగా ఆకర్షిస్తున్నది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరిపై వస్తున్న డేటింగ్ రూమర్ల నేపథ్యంలో రాజ్ నిడిమోరు గురించి, ఆయన ఫ్యామిలీ, అలాగే ఆయన భార్య శ్యామలీ డే గురించిన విషయాలు మీడియాలో భారీ చర్చకు దారి తీశాయి. అయితే రాజ్ నిడిమోరు విడాకులు తీసుకొలేని కారణంగా సమంత రెండో పెళ్లికి అడ్డంకిగా నిలిచే అవకాశం ఉందనే వార్త తాజాగా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకొన్న తర్వాత ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో రాజ్ నిడిమోరు ఆమెకు అండగా నిలిచారు. ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం వారిద్దరిని మరింత దగ్గరగా చేర్చింది. ఈ క్రమంలో భార్య శ్యామలీ డే తో విభేదాలు రావడం, వారిద్దరి వేర్వేరుగా జీవించడం మొదలు పెట్టారు. ఆ నేపథ్యంలో సమంత, రాజ్ నిడిమోరు మధ్య బంధం మరింత బలంగా మారిందని పలు జాతీయ మీడియా వెబ్ సైట్లలో కథనాలు వచ్చాయి.

Samantha Ruth Prabhu

రాజ్ నిడిమోరుకు సంబంధించిన మరో రూమర్ కూడా మీడియాలో ట్రెండ్ అయింది. అయితే శ్యామలీ, రాజ్ నిడిమోరుకు కూతురు ఉంది. ఆ కూతురు పరిస్థితి ప్రస్తుతం ఏమిటి? అంటూ కథనాలు వచ్చాయి. ఓ చిన్నారితో రాజ్ నిడిమోరు ఉన్న ఫోటోను మీడియాలో ప్రచారమైంది. అయితే వాస్తవానికి రాజ్, శ్యామిలీకి ఎలాంటి సంతానం లేదు. ఆ చిన్నారి ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ డీకే కుమార్తె అనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది.

అయితే సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో వారిద్దరూ ఓ ఇంటిని కొనుగోలు చేసేందుకు వెతుకుతున్నారు అనే వార్త మీడియాలో వైరల్ అయింది. ఆ వార్త బయటకు రాగానే రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ నర్మగర్భంగా కొన్ని పోస్టులను ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టారు. నా గురించి ఆలోచించే వారికి, నన్ను కలువాలనుకొనే వారికి ప్రేమతో కూడిన ఆహ్వానం అంటూ పోస్టు పెట్టారు. ఆ తర్వాత ఖర్మ అంటూ మరో పోస్టుతో సంచలనం రేపారు. ఇలా శ్యామలీ డే చెప్పి చెప్పకుండా తెలిసి తెలియకుండా కొన్ని పోస్టులు పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

Take a Poll

అయితే సమంత, రాజ్ నిడిమోరు రెండో పెళ్లికి చట్టం ప్రకారం కొన్ని అభ్యంతరాలు, కొన్ని పరిమితులు ఉన్నాయనే విషయం మీడియాలో చర్చ జరుగుతున్నది. అధికారికంగా శ్యామలీతో రాజ్ విడాకులు తీసుకులేదు కనుక.. వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి మ్యారేజ్ యాక్ట్ ఒప్పుకోదు. కాబట్టి వారిద్దరూ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయాలని నిర్ణయించుకొన్నట్టు ఓ వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ వార్తలో నిజం లేదు. అంతా రూమరే అని సమంత మేనేజర్ కొట్టి పడేశారు. అయినా వారిద్దరి రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, సమంత, రాజ్ నిడిమోరు కలిసి నిర్మించిన శుభం సినిమా భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీగా బిజినెస్ పూర్తి చేసుకొన్నది. థియేట్రికల్‌ రన్‌లో సుమారు 6 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. సమంత, రాజ్ నిర్మాతలుగా సక్సెస్ కావడం, ఇండస్ట్రీకి మంచి జరిగిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. వారి బ్యానర్‌లో మరిన్ని సినిమాలు రావాలని ఆశిద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X