Samnatha బాలీవుడ్‌ స్టార్ హీరోతో సమంత రొమాన్స్..

స్టార్ హీరోయిన్ సమంత గతేడాది మొత్తం సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడిప్పుడే సినిమాలను ఒప్పుకుంటున్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తోంది. వరుసగా సినిమాలను ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.

చేసే తక్కువ సినిమాలను అయినా మంచివి ఎన్నుకోవాలని ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ క్రమంలోనే ఆమె మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది సామ్. ఈ సినిమాతో ఆమె నిర్మాతగా కూడా మారబోతుంది. ఇక ఇది కాకుండా సిటాడెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక సినిమాలతో పాటు అమ్మడు యాడ్స్ తో బిజీగా మారింది. ఈ మధ్యనే సమంత బాలీవుడ్ లో మరో సినిమా ఒప్పుకుందని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.

Is Samantha Ruth Prabhu pairing with Shah Rukh Khan in Rajkumar Hirani s next patriotic film

ఇక ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది. ఈ చిన్నది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ- షారుక్ కాంబోలో వచ్చిన డంకీ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన విషయం తెల్సిందే. కానీ, ఈసారి మాత్రం ఎలాగైనా ఈ కాంబో హిట్ కొట్టాలని కసిగా ఉన్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా లెవెల్ కథ కావడంతో రాజ్ కుమార్ హిరానీ సైతం స్టార్ క్యాస్టింగ్ గట్టిగా తీసుకోవాలని అనుకున్నాడట. ఇందులో భాగంగానే సమంత అయితే హీరోయిన్ పాత్రకు సెట్ అవుతుందని భావించి ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఇక షారుక్ ఖాన్ సినిమా అనేసరికి ఈ చిన్నది ఎగిరి గంతేసింది అంట. ఎందుకంటే.. షారుక్ ఖాన్‌కి సమంత చాలా పెద్ద ఫ్యాన్.

Is Samantha Ruth Prabhu pairing with Shah Rukh Khan in Rajkumar Hirani s next patriotic film

ఇక ఈ విషయాన్నీ ఆమె ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. మహేష్ బాబు, సూర్య, షారూఖ్ ఖాన్‌లతో యాక్ట్ చేయడానికి తాను ఇష్టపడతానని ఆమె తెలిపింది. ఇప్పటికే సూర్యతో,మహేష్ బాబుతో సామ్ నటించి మెప్పించింది.ఇక ఇప్పుడు షారుక్‌తో నటించే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది. వెంటనే ఓకే చెప్పిందని టాక్. ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే సామ్.. ఇక బాలీవుడ్ లో పాగా వేసినట్టే.

ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ తో బాలీవుడ్ లో ఎంటర్ అయిన సామ్.. ఇప్పుడు సిటాడెల్ తో ఆ ఎంట్రీని స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఇప్పుడు రాజ్ కుమార్ హీరోయిన్స్ లిస్ట్ లో సామ్ చేరితే.. బాలీవుడ్ హీరోయిన్ గా అమ్మడు సెట్ అయ్యినట్టే అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X