సమంత కావాలనే అలా చేసిందా.? శోభితతో నాగచైతన్య ఇలా.!

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్రయూనిట్ ఈమూవీని విజయవంతం చేసిన సందర్భంగా తండేల్ సునామీ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అక్కినేని నాగార్జున కూడా హాజరై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైతన్య, తన భార్య శోభితాతోనూ ఈవెంట్ కు హాజరై సందడి చేశారు. యాంకర్ వారితో కొన్ని సరదా ప్రశ్నలు అడిగి నవ్వులు పూయించారు. మరోవైపు చైతూతో 'బుజ్జితల్లి' డైలాగ్ ను శోభితాకు చెప్పించడం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇదంతా బానే ఉంటే.. మరోవైపు నాగచైతన్య మాజీ భార్య సమంత రూత్ ప్రభు పోస్ట్ వైరల్ గా మారింది. 'మనిషి ప్రపంచంలో శాశ్వతం కాదు. ఎప్పటికప్పుడు మారుతుంటాడు. ఏదీ స్థిరంగా ఉండదు. అందుకే ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండొచ్చు'... అనే కోట్ ను షేర్ చేసుకుంది. దీంతో అది నాగచైతన్యను ఉద్దేశించే అంటూ నెట్టింట వైరల్ గా చేస్తున్నారు. అయితే గతంలోనూ సమంత ఎన్నో పోస్టులు పెడుతూనే వచ్చారు. కానీ డైరెక్ట్ గా ఎప్పుడూ కామెంట్స్ చేయలేదు. కొందరు కావాలనే ఇలా క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చైతన్యకు రిలేటెడ్ గానే పెడుతుందని.. చైతూ సక్సెస్ లో ఉన్నప్పుడే ఎందుకిలాంటి పోస్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా సమంత, చైతూ తమ తమ జీవితాల్లో ఫుల్ బిజీ అయ్యారు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Is Samantha Ruth Prabhu post releated to Naga Chaitanya and Sobhita Dhulipala

ఇక నాగచైతన్యకు శోభితా ధూళిపాళ్ల మాత్రం ఎంతో సపోర్టివ్ గా నిలుస్తున్నారు. తండేల్ రిలీజ్ కు ముందే.. ఆమె స్పందిస్తూ... 'తండేల్' రిలీజ్ కాబోతుండటం సంతోషంగా ఉందని, టీమ్ మొత్తానికి విషెస్ తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా వరుసగా సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేస్తోంది. సక్సెస్ మీట్ లోనూ కనిపించి అక్కినేని అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. నాగచైతన్యతో పాటు అటు శోభితా కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వస్తున్నారు.

ఇక చైతూ శ్రీకాకుళం ఫిషర్ మెన్ రాజు పాత్రలో జీవించాడు. అతని నటన ఆడియెన్స్ నుంచే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా మంచి స్పందన దక్కుతోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా 'తండేల్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సాయిపల్లవి నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.85 కోట్ల వరకు వసూళ్లు చేపట్టిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. త్వరలోనే సినిమా బ్రేక్ ఈవెన్ ను కూడా పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం అదుర్స్ అనిపించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత బన్నీ వాసు గ్రాండ్ స్కేల్ లో నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పించారు. దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X