టెలిఫోన్ ట్యాపింగ్‌లో సమంత, రకుల్‌? .. మరో 13 హీరోయిన్లను లొంగదీసుకొని అలా బ్లాక్ మెయిల్ అంటూ

తెలంగాణ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రకరకాల ఊహాగానాలు మీడియాలో స్వైర విహారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో పేపర్ లీకేజ్ ఇష్యూస్, అలాగే టెలిఫోన్ కాల్స్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు బురద జల్లుకొంటున్నారు. అయితే తాజాగా కొందరు పొలిటికల్ విశ్లేషకులు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..

గత ప్రభుత్వ హాయంలో రాజకీయ, బిజినెస్, సినీ, ఇతర ప్రముఖుల ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టింది. వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసి వారి సీక్రెట్స్‌ను గుప్పిట్లో పెట్టుకొన్నది. పలువురిని రకరకాలుగా వేధించడంతోపాటు ఆస్తులు, ఇతర అంశాల్లో బ్లాక్ మెయిల్ చేశారనే వార్తలు మీడియాలో వెలుగు చూశాయి.

Samantha Ruth Prabhu Rakul Preet Singh

ఇక సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లను ఫోన్లపై నిఘా పెట్టారు. వారు ఏమి మాట్లాడుకొంటున్నారో తెలుసుకొని వారిని వివరాలు వెల్లడించి.. వారిని లోబరుచుకొన్నారు. హీరోల్లో కొందరిని డ్రగ్స్ కేసులో వేధింపులకు పాల్పడగా.. హీరోయిన్లను రకరకాలు, అన్ని రకాలుగా వేధించారనే విషయంపై ఊహగానాలు చెలరేగిపోయాయి.

అయితే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా సమంత రుత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ల పేర్లను ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పలువురు అధికార పక్ష నేతలు బాహటంగా పేర్కొనడంతో ఈ విషయం సాధారణ ప్రజలకు ఆసక్తికరంగా మారింది. ఇక కొందరు ఔత్సాహికులు, రాజకీయ విశ్లేషకులు యూట్యూబ్ మీడియాలో సంచలన రీతిలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండటం మరింత సంచలన రేపింది.

ఇక టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో సమంత, రకుల్ ప్రీత్ మాత్రమే కాకుండా మొత్తం 13 మంది హీరోయిన్లు ఉన్నారు. వారి ఫోన్లను దొంగచాటుగా విని వారి వ్యక్తిగత విషయాలను బూచీగా చూపి సినీ తారలను లొంగ దీసుకొన్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు డైరెక్టుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఈ వ్యవహారం సీరియస్ అయినప్పటీకి.. అందులో ఎంత నిజముందనే విషయం బయటకు రావాలంటే.. దర్యాప్తు అధికారులే స్వయంగా వెల్లడిస్తే ఈ ఊహాగానాలకు తెరపడటమే కాకుండా స్టార్ హీరోయిన్ల ప్రతిష్టకు, ఇమేజ్‌కు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకొన్నట్లు అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X