రాంచరణ్ మూవీని రిజెక్ట్ చేసిన సమంత.. కారణం ఏమిటంటే?
సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం ఆమె మయెసైటిస్ వ్యాధి బారిన పడిన విషయం కూడా విదితమే. అదొక అరుదైన చర్మ సంబంధిత వ్యాధి. దీనికి మెడిసిన్ కూడా లేకపోవడంతో ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఇక దీనికి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి చికిత్స తీసుకొని వస్తుంది. ఇక గతేడాది మొత్తం సినిమాలకు గ్యాప్ తీసుకుని ప్రకృతిని ఎంజాయ్ చేసింది. గ్యాప్ తీసుకున్న కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది. అయితే ఇటీవల మెగా హీరో సినిమా భారీ ఆఫర్‌ను తిరస్కరించిందనే వార్త వైరల్ అవుతున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం సామ్ చేతిలో సిటాడెల్ వెబ్ సిరిస్ లో నటిస్తోంది. ఇక ఇది కాకుండా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అనేది ఇంకా తెలియదు. ఇవి కాకుండా పాడ్ కాస్ట్ మొదలుపెట్టి హెల్త్ గురించి చెప్పుకొస్తుంది.

ఇంకోపక్క వరుస ఫోటోషూట్స్ తో బిజీగా మారింది. అయితే ప్రస్తుతం సమంత కు వరుస ఛాన్స్ లను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి రామ్ చరణ్ - వెట్రిమారన్ సినిమా. ఈ కాంబో గురించి ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.. తమిళ్ లో పరాజయం ఎరుగని దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు.
ఆయన గతేడాది విడుదల అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత వెట్రిమారన్.. తెలుగులో రామ్ చరణ్ తో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం చరణ్ .. గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయాల్సి ఉండగా.. ఆ సినిమా సెట్స్ మీదనే ఆగిపోయింది. ఇక ఆ సినిమా ప్లేస్ లో చరణ్..
వెట్రిమారన్ తో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత అయితే బావుంటుందని అనుకొని మేకర్స్ .. సామ్ ను సంప్రదిస్తే ఆమె నో చెప్పిందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రంగస్థలం లాంటి పెద్ద సూపర్ హిట్ సినిమా వచ్చింది.
ఇక వీరి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందని తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ, సామ్ .. నో చెప్పడంతో ఆమెపై చరణ్ ఫ్యాన్స్ యుద్ధం ప్రకటించారు. చరణ్ సినిమానే నో అంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె ఎందుకు తిరస్కరించింది అనేది ఇంకా తెలియాల్సింది. అయితే అసలు ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











