యంగ్ హీరోతో సమంత రొమాన్స్.. ఆ స్టార్ హీరోయిన్ దారిలో సామ్!
జెనరల్ గా వయస్సులో వ్యత్యాసం అనేది మగ వారికి ఎక్కువ ఆడవాళ్లకు తక్కువ ఉండే విధంగా జంటలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే అనాదిగా సినిమాల్లోనూ సహా బయట లైఫ్ లో కూడా కొనసాగుతూనే వస్తుంది. కాగా ఈ క్రమంలో అనేకమంది సీనియర్ హీరోలు ఇప్పటికీ తమ వయస్సులో సగం ఉన్న యువ హీరోయిన్స్ తో హీరోలుగా కొనసాగుతున్నారు.
దీనితో వీటిపై చాలా ట్రోల్స్ కూడా పడ్డాయి. కానీ వయసులో తమకంటే చిన్న వాళ్ళు అయ్యిన హీరోలతో సీనియర్ హీరోయిన్స్ వర్క్ చేసినపుడు మాత్రం వాటిని స్వాగతిస్తారు. కాగా ఇటీవల తెలుగు సినిమా దగ్గర వచ్చిన ఏజ్ ఎక్కువ హీరోయిన్ ఏజ్ తక్కువ హీరోయిన్ కాంబినేషన్లో ప్రెజెంట్ టాలీవుడ్ ఆల్ టైం టాప్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత చేసిన చిత్రం "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి" ఒకటి.

కాగా ఈ సినిమాలో తనకంటే చిన్నవాడు అయిన నవీన్ పొలిశెట్టి సరసన హీరోయిన్ గా అనుష్క నటించింది. కాగా ఇప్పుడు ఈమె బాటలోనే మరో టాలీవుడ్ టాప్ బ్యూటీ పాన్ ఇండియా సెన్సేషన్ సమంత కూడా ఫాలో అవుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా సమంత కెరీర్ నుంచి కొంత బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలిపి చాలా నెలల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది.
అయితే రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో సమంత టాలీవుడ్ లో ఉండట్లేదు ఇక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా లేదు అని ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు సమంత కేవలం తన ప్రొడక్షన్ లోనే తెలుగులో వర్క్ చేస్తుంది. తన నిర్మాణంలో తన నటనతో "మా ఇంటి బంగారం" అనే ఓ సినిమా చేస్తుంది. ఇది కాక మరో సినిమానే తనకంటే చిన్నవాడు అయిన యువ హీరోతో ఆమె నటిస్తున్నట్టు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఆ యువ నటుడు ఎవరో కూడా కాదు నటుడు ప్రియదర్శి అట. ఇతడు సామ్ కంటే రెండేళ్ళు చిన్నోడు అయినప్పటికీ సామ్ ప్రియదర్శి సరసన నటించేందుకు ఓకే చెప్పినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ కాంబినేషన్ దాదాపు కన్ఫర్మ్ అన్నట్టు కూడా వినిపిస్తోంది. కానీ ఇది కాకుండా సామ్, ప్రియదర్శి కేవలం సినిమా కోసం కలుస్తున్నారు అంటే సామ్ ప్రొడక్షన్ లో నటిస్తున్నాడు తప్ప సామ్ తో నటించడం లేదు అని తెలుస్తోంది.
మరి ఈ రెండు వెర్షన్ లలో ఒకదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం సమంత నటించిన భారీ ఓటీటీ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ స్పై థ్రిల్లర్ సిరీస్ ఈ నవంబర్ రిలీజ్ కి రాబోతుండగా ఈ సిరీస్ కాకుండా తుంబాడ్ దర్శకుడు అనీల్ రాహి బార్వే తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ లో కూడా నటిస్తుంది. ఇలా సమంత అయితే ప్రస్తుతం నటిగా ఇంకో పక్క నిర్మాతగా కూడా ఫుల్ బిజీగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











