ఏ మాత్రం తగ్గని సమంత, చైతూకు ఊహించని షాక్..
ఒకప్పడు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీ కపుల్స్ నాగ చైతన్య-సమంత. ఆ జంటకు ఎవరు దిష్టి పెట్టారో తెలియదు. గానీ.. ప్రేమించి పెద్దలను ఒప్పించి.. మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట కొద్ది రోజులకే విడిపోయింది. ఎవరూ ఊహించిన విధంగా చైతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాణంలా ప్రేమించిన సామ్ కు విడాకులు ఇచ్చాడు. సరేలే.. ఎవరి జీవితాలు వారివి.. చైతూ గానీ, సామ్ గానీ తమ డిసిషన్ మార్చుకుని ప్యూచర్ లోనైనా కలువబోతారా..? అని భావించిన అక్కినేని అభిమానులకు కూడా నిరాశే మిగిలింది. తాజాగా శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి డే ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సందర్భంలో సమంత తన మాజీ భర్త నాగచైతన్యకు దిమ్మతిరిగిపోయేలా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నిర్ణయమేంటో మీరు కూడా లూక్కేయండి.
వాస్తవానికి ఈ సంచలన నిర్ణయం వెనుక చాలా రోజు ప్రచ్ఛన్న యుద్ధం జరిగిందంట. నాగ చైతన్య-సమంతలు 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ, పెళ్లైనా కొద్ది రోజులకే ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయంట. కొంతమంది సినీ పెద్దలు ఈ జంటను కలపాలని చూసిన ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి 2021లో విడాకులు తీసుకుని తమ పెళ్లి బంధాన్ని పుల్ స్టాప్ పెట్టారు. నిజానికి సామ్ - చైతూలు సైలెంట్ గానే విడాకులు తీసుకున్నా.. ఆ తర్వాత నటి సమంతనే చాలా మందికి టార్గెట్ చేశారు. ఆ తరువాత జరిగిన ప్రచారం మరో ఎత్తు అనే చెప్పాలి.

ఆ ముద్దుగుమ్మపైనే ఎన్నో ఆరోపణలు, పలు అసత్య ప్రచారాలు చేశారు. సమంతకు పిల్లలను కనడం ఇష్టం లేదు. చైతూకు తెలియకుండా పలుమార్లు అబార్షన్ చేయించుకున్నారనీ, నాగ చైతన్యకు ఇష్టం లేకున్నా బోల్డ్ సీన్స్ లో నటిస్తుందనీ, తనకు ఫ్యామిలీ అంటే అసలు పట్టింపు లేదనీ, అంతటీతో ఆగకుండా .. సామ్ కు తన వ్యక్తిగత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌తో ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తుందని ఆరోపణలు వచ్చాయి.
కానీ, నాగ చైతన్యను ఉద్దేశించి ఒక్క నెగిటివ్ రూమర్ కూడా రాలేదు.
తాను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనకు విడాకులిచ్చాడనీ బాధ ఒక్కవైపు.. నిరాధార ఆరోపణలతో తన క్యారెక్టర్ ను కించపరుస్తున్నారని మరోవైపు సమంత కృంగిపోయింది. తనవైపు.. అసత్య ప్రచారం చేసిన కొన్ని మీడియా ఛానల్స్ మీద ఆమె చర్యలు తీసుకున్నారు. ఈ మనోవేదన నుండి బయటపడటానికి ఈ తరుణంలో సామ్ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు పుణ్యక్షేత్రాలను సందర్శించింది.
ఇక.. జీవితంలో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమేననీ భావించిన మల్టీ టాలెంటెండ్ సామ్.. తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. జీవితంలో ఎదురైన భాదలను మరిచిపోవడానికి టాప్ గేర్ లో సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది. వరుసగా సినిమాలు చేస్తూ.. తన స్టార్డమ్ ను మరోసారి సుసిర్థం చేసుకుంది. టాలీవుడ్.. బాలీవుడ్ అనే తేడా లేకుండా.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాకెట్ లా దూసుకెళ్తున్నారు.

కట్ చేస్తే.. ఒంటరి జీవితానికి కారణమైన తన మాజీ భర్త నాగ చైతన్య మరొక హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం కేవలం సమంతకు మాత్రమే కాదు.. ఆమె అభిమానులను బాధ కలిగించింది. వాస్తవానికి సామ్- చైతూ విడాకుల విషయంలో నాగ చైతన్యదే తప్పని సమంత ఫ్యాన్ ఆరోపణలు చేశారు. సమంతకు విడాకులు చైతూ ఇవ్వడానికి శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ నే కారణమనే వాదన కూడా ఆ సమయంలో తెరపైకి వచ్చింది. ఆ వాదనకు బలం చేకూర్చేలా నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో సమంత కూడా నాగ చైతన్య మీద తన అసహనాన్ని ప్రదర్శించింది. తాను ఏం తప్పు చేయలేదని నేరుగా చెప్పింది.
సమంత-నాగ చైతన్య లు విడిపోవడానికి శోభిత కారణమా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది పక్కన పెడితే.. సామ్ మాత్రం నాగ చైతన్య మీద పీకలాదాగా కోపంగా ఉంది. ఈ నేపథ్యంలో తనకు చైతూ అన్యాయం చేసిన భావించిన సమంత సెన్సెషనల్ డిసీషన్ తీసుకున్నట్టు టాక్. తాను జీవితంలో మరోసారి పెండ్లి చేసుకోకూడదని, వైవాహిక బంధాల్లో చిక్కుకోకూదనీ, అదే తన మాజీకి చేస్తే శిక్షగా సామ్ భావిస్తుందట. ఇలా చేస్తే.. చైతూకు జరిగే నష్టమేంటీ? ఆడవి పెళ్లి చేసుకోకపోతే.. నాగ చైతన్యకు పడే శిక్ష ఏంటని ఆలోచిస్తున్నారు. తన మాజీ భార్య సామ్ పెళ్లి చేసుకోలేదని, తన వల్లె ఆమె ఈ నిర్ణయం తీసుకుందని, ఈ విషయం గుర్తుకు వచ్చిన ప్రతిసారి.. నాగ చైతన్య తాను చేసిన తప్పు గుర్తు రావాలని ఈ నిర్ణయం తీసుకుందట. అంతేకాకుండా.. తన కెరీర్లో చైతు కంటే టాప్ లో ఉండాలని, తమ మాజీ తనను చూసిన ప్రతి క్షణం ఈర్ష్య పడేలా ఎదగాలని సామ్ భావిస్తుందని సోషల్ మీడియాలో టాక్.. నిజంగా సామ్ ఈ నిర్ణయం తీసుకుంటే.. నాగ చైతన్యకు చుక్కలే.


Click it and Unblock the Notifications











