సమంతకి బిగ్ షాక్ .. తన బిగ్ ప్రాజెక్ట్ ని ఆపేసారా? ఏదంటే?
ప్రస్తుతం సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకరు. మరి సామ్ తన కెరీర్లో కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఫైనల్ గా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి బిజీగా మారింది. అయితే నేరుగా సినిమాలు ఆమె స్టార్ట్ చేయలేదు కానీ పలు వెబ్ సిరీస్ లు చేస్తూ తాను బిజీగా మారింది.
అయితే సామ్ నుంచి కం బ్యాక్ ఇచ్చాక వచ్చిన వెబ్ సిరీస్ నే సిటాడెల్ హనీ బన్నీ. ఈ సిరీస్ ని హాలీవుడ్ మేకర్స్ రస్సో బ్రదర్స్ హాలీవుడ్ లో తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ కాగా దీనిని అనేక దేశాల్లో కూడా రీమేక్ చేయడం జరిగింది. ఇలా మన ఇండియన్ వెర్షన్ కి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకేలు వర్క్ చేశారు. మరి ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత మళ్ళీ వారి కోసం వర్క్ చేసింది.

ఇక ఈ సిరీస్ తర్వాత సెన్సేషనల్ హిట్ చిత్రం తుంబాడ్ దర్శకుడు అనీల్ రహి బర్వెతో మరో సంచలన సిరీస్ ని ఆమె చేస్తుంది. ఇలా బిజీగా ఉన్న సమంతకి బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. సమంత చేతిలో ఉన్న ఈ సిరీస్ కాకుండా మరో సిరీస్ కూడా ఉంది. అదే సిటాడెల్ కి సీక్వెల్. హీరో వరుణ్ ధావన్ తో చేసిన ఈ సిరీస్ కి మేకర్స్ సీక్వెల్ ని ప్లాన్ చేసారు కానీ ఇపుడు ఈ సిరీస్ ని ఆపేసినట్టుగా తెలుస్తుంది.
కాగా ఈ సిరీస్ ని స్వయంగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారే నిలిపేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి సీజన్ 1 కి అనుకున్న రేంజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి రాలేదు. అప్పటికి ఉన్న హైప్ లో వచ్చిన రెండు మూడు రోజుల్లో ఆడియెన్స్ చూసారు తప్పితే మిగతా ఆడియెన్స్ ని రప్పించే రేంజ్ లో లేదు అనే మాట స్ప్రెడ్ అయ్యేసరికి ఈ సిరీస్ కి సీక్వెల్ ని మొదట అనుకున్నారు.
కానీ ఇపుడు మాత్రం ఈ నిర్ణయం నుంచి వెనక్కి వచ్చేసారట. దీనితో సమంత అనుకున్న సిరీస్ ఆగిపోయిందట. మరి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఒకవేళ నిజం అయితే మాత్రం సమంత కెరీర్ రీస్టార్ట్ చేసిన మొదట్లోనే దెబ్బ అని చెప్పక తప్పదు. ఇక ఇవి పక్కన పెడితే ప్రస్తుతం సామ్ ఆ రక్త బ్రహ్మాండ్ లో బిజీగా ఉండగా ఈ సిరీస్ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలకి ఆమె పేరు వినిపిస్తుంది.
కానీ ఇంకా సామ్ అయితే తెలుగులో ఏ సినిమా ఓకే చేయనట్టే తెలుస్తుంది. అలాగే వీటితో పాటుగా తన నిర్మాణంలో పలు సినిమాలు ఉన్నాయి అలాగే తన నిర్మాణంలోనే దర్శకుడు ఎవరో కూడా తెలియని సినిమాని ఆమె పూర్తి చేయాల్సి ఉంది. మొత్తానికి మాత్రం సమంత పరిస్థితి కొంచెం డిఫరెంట్ గానే ఉందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











