అల్లు అర్జున్ కేసు .. సంధ్య థియేటర్ ఘటనపై షాకింగ్ ఫుటేజ్ లీక్?
తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఏ హీరో చూడని భారీ హై మూమెంట్స్‌ని అలాగే లో మూమెంట్స్ ఇపుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్నాయి. ఈ డిసెంబర్ నెలలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ కొట్టి రికార్డులు తిరగరాస్తోంది. బన్నీ ఫ్యాన్స్ ఆనందం ఆవిరి చేస్తూ తెలంగాణలో జరిగిన షాకింగ్ ఘటన అల్లు అర్జున్‌ని ఆ హై మూమెంట్స్ ని ఎంజాయ్ చేయనివ్వకుండా వెనక్కి లాగేసినట్టు అయ్యింది.
హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దారుణ ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఒక కుటుంబమే ఛిద్రం అయ్యిపోయింది. రేవతి అనే వివాహిత ప్రాణాలు కోల్పోగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఇపుడు సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. కాగా ఈ ఇష్యూ లో ఆ థియేటర్ దగ్గర జరిగిన విషాద ఘటనలో అల్లు అర్జున్ విషయంలో చేసిన హంగామా కూడా అంతా ఇంతా కాదంటూ ఆన్‌లైన్‌లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

కాగా నాణేనికి రెండు వైపులా చూసినట్టు కొంతమంది అయితే అల్లు అర్జున్ వల్లే ఈ దుర్ఘటన జరిగింది అంటూ మండిపడుతున్నారు. పోలీసులు వద్దు అని చెప్పినా ఆయన రావడం మూలానే ఆమె చనిపోయింది, ఆ పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అంటూ చాలా నెగిటివిటీని అల్లు అర్జున్ మూట కట్టుకున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడమే మళ్ళీ తనని విచారణకి పిలవడం వంటివి కూడా జరిగాయి.
కానీ ఇపుడు ఒకొక్కటిగా కొన్ని షాకింగ్ నిజాలు బయటకి వస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అసలు రేవతి మరణానికి అల్లు అర్జున్‌నే కారణం అంటూ ప్రచారం జరుగుతోంది. థియేటర్ దగ్గరకి తాను వచ్చాడు ఒక్కసారిగా జనం ఎక్కువయ్యారు ఆమె తొక్కిసలాటలో ఇరుక్కున్నారంటూ అందరూ భావిస్తున్నారు. ఇదంతా డిసెంబర్ 4న రాత్రి 11 గంటల సమయంలో జరిగింది అని టాక్ ఉంది.
కాగా ఈ ఘటనకి సంబంధించి ఓ షాకింగ్ వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ రాకకి ముందే అస్వస్థతకి లోనయిన రేవతిని బయటకి తీసుకెళ్లిన దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఆమెని థియేటర్ బయటకి తీసుకెళ్తున్న సమయం సుమారు 9 గంటల 16 నిముషాలు అయితే అల్లు అర్జున్ అక్కడికి వచ్చింది 9 గంటల 40 నిమిషాలకు అని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ వీడియోల కారణంగా ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కొందరు ఇది నిజమని అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం సదరు ఫుటేజ్‌ని ఎడిట్ చేశారని అంటున్నారు. ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











