బీజేపీ నేత కొడుకుతో సూపర్ స్టార్ కూతురు సహజీవనం.. ఆ యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Bollywood: బాలీవుడ్ లో డేటింగ్ రూమర్స్ కొత్తవి కాదు. ఏ హీరోయిన్ అయినా లేదా ఏ హీరో అయినా.. వేరే వ్యక్తితో కనిపిస్తే చాలు లేదా వేరే వ్యక్తి తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తే చాలు.. వారిద్దరూ ఎన్నో రోజులుగా చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారనీ, ఆ జంట ఎన్నో రోజుల నుండి డేటింగ్ లో ఉంది. ఎక్స్.. వై.. జెడ్.. అంటూ అనేక రూమర్స్ క్రియేట్ చేస్తారు. అలా తాజాగా ఓ సూపర్ స్టార్ కూతురు, బాలీవుడ్ హీరోయిన్ పై రూమార్స్ వస్తున్నాయి. ఆ బ్యూటీ బీజేపీ నేత కొడుకుతో డేటింగ్ లో ఉన్నట్లు బీ టౌన్ లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ సూపర్ స్టార్ కూతురు ఎవరు? ఓ లుక్కేయండి.
ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో కాదు.. సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్(Sara Ali Khan). ఈ హీరోయిన్ సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో సారా అలీఖాన్ ఎవరితో డేటింగ్ చేస్తోందనీ, సారా అలీఖాన్ ప్రేమలో పడిందని, ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకుతో సహజీవనం చేస్తుందని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకీ ఈ లక్కీ పర్సన్ ఎవరనేది హాట్ టాఫిక్ గా మారింది.

ఎందుకీ ప్రచారం జరుగుతోందంటే.. సారా అలీఖాన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ.. తరుచు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు కేదార్‌నాథ్ టూర్ కు వెళ్లింది. ఈ టూర్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అలాగే.. ఈ టూర్ కు సంబంధించిన ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకుంది. అయితే.. ఈ ఫోటోల్లో తన బాయ్‌ఫ్రెండ్, ప్రముఖ మోడల్ అర్జున్ కూడా ఉన్నారు. ఓ ఫోటోలో సారా, అర్జున్ భీమ శిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి. ప్రముఖ మోడల్ అర్జున్ తో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి.
ఇంతకీ అర్జున్ ప్రతాప్ బజ్వా ఎవరు?
అర్జున్ ప్రతాప్ బజ్వా (Arjun Pratap Bajwa) మోడల్, నటుడు. దేశంలోని చాలా మంది పెద్ద డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేశాడు. అర్జున్ ఓ ట్రావెలర్ కూడా . వివిధ ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతాడు. అర్జున్ MMA ఫైటర్ కూడా.. అలాగే..'సింగ్ ఈజ్ బ్లింగ్'తో పాటు పలు చిత్రాల్లో నటంచారు. అర్జున్‌కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఇక అర్జున్ కుటుంబ విషయానికి వస్తే.. పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఫతే జంగ్ సింగ్ బజ్వా కుమారుడు. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

సారా అలీ ఖాన్ రాబోయే సినిమాల విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్‌తో నటించనున్నారు. అనురాగ్ బసుక దర్శకత్వం వహిస్తున్నా మెట్రో మూవీలో కనిపించనున్నారు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, పంకజ్ త్రిపాఠి, నీనా గుప్తా, ఫాతిమా సనా షేక్ తదితరులు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం మెట్రో మూవీ నవంబర్ 29న విడుదల కానున్నది. ఈ పర్యటన తరువాత నుంచి అర్జున్-సారా డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వస్తున్నాయి. అయితే. ఈ రూమర్స్‌పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











