Engagement: జాన్వీ కపూర్‌కు తోడి కోడలుగా స్టార్ హీరోయిన్.. సీక్రెట్‌గా బాలీవుడ్ భామ ఎంగేజ్‌మెంట్?
ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌కు సీక్రెట్ గా ఓ ధనిక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా సారా అలీఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని టాక్ నడుస్తోంది.
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రస్తుతం నిశ్చితార్థం రూమర్స్ తో వార్తల్లో నిలిచింది. గతంలో ఆమె కార్తీక్ ఆర్యన్ నుండి క్రికెటర్ శుభమాన్ గిల్ వరకు చాలా మంది వ్యక్తులతో ప్రేమలో ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు సారా అలీఖాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ బాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ నటి తన భాగస్వామిని తానే ఎంపిక చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

తాజాగా సారా అలీ ఖాన్ ఒక ధనిక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుందని, త్వరలో వివాహం చేసుకోబోతోందనే వార్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన రెడ్డిట్‌లో ఎవరో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఆ పోస్ట్‌లో సారాకు నిశ్చితార్థం జరిగిందని, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని రాశారు.
ప్రస్తుతం సారా మెట్రో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. అయితే తరువాత ఈ బ్యూటీ కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. దీంతో సారా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు మొదలయ్యాయి. అలాగే ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి కూడా చాలా వార్తలు వచ్చాయి. ఆ వార్తాలపై ఇప్పటి వరకు నటి సారా అలీ ఖాన్ గానీ, ఆమె కుటుంబం గానీ స్పందించలేదు. దీంతో అసలు ఈ వార్తలు నిజమా లేక రూమర్సా అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.
ఈ నేపథ్యంలోనే సారా అలీఖాన్ పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఇతనే అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా సారా అలీఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని అంటున్నారు. భవిష్యత్తులో ఈ రూమర్ నిజమైతే జాన్వీ కపూర్, సారా అలీఖాన్ ఒకే ఇంటి నుండి కోడళ్ళు అవుతారు. ఎందుకంటే జాహ్నవి కపూర్ మనసు గెలుచుకున్న శిఖర్, సుశీల్ కుమార్ షిండేకి మరో మనవడు. శిఖర్‌తో ప్రేమలో ఉన్నట్టు జాన్వీ కపూర్ స్వయంగా వెల్లడించింది.

శిఖర్ పేరు ఉన్న నెక్లెస్ మెడలో వేసుకుని ఆమె పలుమార్లు ఫోటోలకు ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే సారా అలీఖాన్ పెళ్లిపై ఈ వార్తపై బాలీవుడ్‌లో క్యూరియాసిటీ నెలకొంది. అదేవిధంగా సారా అలీ ఖాన్ ప్రేమలో ఉందంటూ గతంలో కూడా పలువురి పేర్లు విన్పించాయి. ముందుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆ తర్వాత, కార్తీక్ ఆర్యన్, సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్, షాహిద్ కపూర్, ఇషాన్, క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌లను వివాహం చేసుకోబోతోంది అని పుకార్లు వచ్చాయి. ఇటీవల ఆదిత్య రాయ్ కపూర్‌తో కూడా ఆమె రిలేషన్ లో ఉందని రూమర్లు వైరల్ అయ్యాయి.
సారా తండ్రి నవాబ్ సైఫ్ అలీ ఖాన్. ఆమె ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ సినిమా రంగంలోకి రాకముందు మామూలు అమ్మాయిగానే కనిపించింది. సారా అలీ ఖాన్ 2018లో కేదార్‌నాథ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. చివరగా 'జరా హాట్కే జరా బచ్కే' చిత్రంలో కనిపించింది.


Click it and Unblock the Notifications











