Seerat Kapoor స్టార్ హీరోయిన్ సోదరుడితో సీరత్ కపూర్ రొమాన్స్.. ఫోటోలతో అడ్డంగా బుక్కైనా బ్యూటీ!
సినీ పరిశ్రమలో హీరోయిన్లు, హీరోల మీద గాసిప్స్, రూమర్లు రావడం సర్వసాధారణమే. తమపై వచ్చే వార్తలను కొందరు చాలా తేలికగానే తీసుకొంటారు. పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తారు. అలాగే యువ నటి సీరత్ కపూర్‌పై గతంలో భారీగా రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సోదరుడు, టాలీవుడ్‌లో లక్కు చెక్ చేసుకొంటున్న యువ హీరోతో సన్నిహితంగా కనిపించి బుక్కాయరు. సీరత్ కపూర్ ఎవరితో డేటింగ్ చేస్తూ.. పీకల్లోతు అఫైర్‌లో ఉందంటే?
సీరత్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. గతంలో రవితేజ, డీజే టిల్లూ హీరో సిద్దూ జొన్నలగడ్డ లాంటి హీరోలతో నటించి మెప్పించింది. తన కంటూ ఇమేజ్‌ను తెచ్చుకొని మంచి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. గ్లామర్ పండిస్తూనే టాలెంట్‌ను ప్రదర్శించుకొనే సినిమాల్లో నటించింది.

ఇక తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాత జాకీ భగ్నానీ నిర్మించిన ఆవోనా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించింది. ఈ ఆల్బమ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఆమన్ ప్రీత్ సింగ్ అనే యువ హీరోతో నటించింది. ఈ వీడియో ఆల్బమ్‌కు మంచి స్పందన లభించింది. వారిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్, కెమిస్ట్రీ బాగా పండింది. అయితే ఈ మ్యూజిక్ ఆల్బమ్ నటించిన తర్వాత ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా బాగానే వినిపిస్తుందని ముంబై మీడియా కోడై కూస్తున్నది.
ఇటీవల తన ప్రేయసి రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే సందర్భంగా నిర్మాత జాకీ భగ్నానీ ఇచ్చిన గ్రాండ్ పార్టీ ముంబైలో నిర్వహించారు. సీరత్ కపూర్, అమన్ ప్రీత్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో సీరత్, అమన్ ప్రీత్ సింగ్ మధ్య నడిచిన రొమాన్స్ అందర్నీ ముక్కున వేలేసుకొనేలా చేసిందని టాక్.

ఇదిలా ఉంటే.. ఇటీవల అమన్ ప్రీత్ సింగ్ ధరించిన హుడీని రకుల్ ప్రీత్ సింగ్ వేసుకొని తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది. అయితే నా హుడీని డ్రై క్లీనింగ్ చేసి తిరిగి ఇవ్వు అని అమన్ అంటే.. అమన్ నీవు నాకు లక్కీ అంటూ సీరత్ కామెంట్ చేసింది. దాంతో వారిద్దరి మధ్య ఏదో యవ్వారం ముదిరిందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తున్నది.
ముంబైలో పలు చోట్ల దర్శనమిస్తున్న ప్రేమపక్షులు సీరత్, అమన్ ప్రీత్ సింగ్ నిజంగా డేటింగ్‌లో ఉన్నారా? వారి రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. అయితే అమన్ ప్రీత్ సింగ్ తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించినా ఆ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. హీరోగా అమన్ తన అదృష్టాన్ని పరీక్షించుకొనే పనిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











