Dragon: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం డ్రాగన్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజూ మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్: రవి బస్రూర్, సినిమాటోగ్రఫి: భువన్ గౌడ, ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్, ఉజ్వల్ కులకర్ణి తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ సినిమా విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకొని ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దించారనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ స్టార్ హీరో ఎవరనే వివరాల్లోకి వెళితే..

Shahid Kapoor playing Antagonist against Jr NTR s Dragon

డ్రాగన్ సినిమా కోసం పలువురు ప్రాంతీయ భాషా నటులను రంగంలోకి దించుతున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మలయాళ యువ హీరో టోవినో థామస్‌ను సంప్రదించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఎదురించే పాత్రలో నటించేందుకు ఆయన కూడా ఒకే చెప్పారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం, మలయాళంలో ఇతర సినిమాల డేట్స్ క్లాస్ కావడంతో ఆ సినిమా నుంచి తప్పుకొన్నారు.

అయితే పల్లిచట్టంబి సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన టోవిన్ థామస్‌ను మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. డ్రాగన్ సినిమాను తాను చేయడం లేదు. ఒక్క సినిమా కోసం ఒకట్రెండు సంవత్సరాలు వెచ్చించలేను. అదే సమయంలో మలయాళంలో మూడు, నాలుగు సినిమాలు చేసుకొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ సినిమా నుంచి స్నేహపూరిత వాతావరణంలో తప్పుకొన్నామని చెప్పారు.

Shahid Kapoor playing Antagonist against Jr NTR s Dragon

అయితే టోవినో థామస్ తప్పుకొన్న తర్వాత పలువురు ఇతర భాషల నటులను సంప్రదింపులు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే విలన్ పాత్రలో నటింపజేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరో షాహీద్ కపూర్‌ను ప్రశాంత్ నీల్ ఒప్పించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారనే వార్త తెలుగు మీడియాలోను, జాతీయ మీడియాలోను విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

అయితే షాహీద్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త కేవలం ఊహాగానాలుగానే ఉంది. అధికారికంగా మైత్రీ మూవీ మేకర్స్ గానీ, ప్రశాంత్ నీల్ టీమ్ గానీ ధృవీకరిస్తే ఆయన డ్రాగన్‌లో నటిస్తున్నారా? లేదా? అనే వార్తకు అధికారికంగా ముద్ర పడుతుంది. అప్పటి వరకు షాహిద్ టాలీవుడ్ ఎంట్రీ రూమర్‌గానే ఉంటుంది. డ్రాగన్ సినిమా అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..

More from Filmibeat

Read more about: shahid kapoor jr ntr dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X