షారూఖ్ ఖాన్ కి పవన్ కావాల్సి వచ్చాడు
హైదరాబాద్ : బాలీవుడ్ బాద్షా కన్ను తెలుగు పరిశ్రమపై పడిందా అంటే అవుననే అంటన్నారు. ఈ మధ్య కాలంతో బాలీవుడ్ లో దక్షిణాది చిత్రాలు వరస విజయాలు సాధిస్తున్న నేపధ్యంలో షారూఖ్ ఖాన్ ఇక్కడ సినిమాలపై ఓ కన్నేసినట్లు చాలా కాలం నుంచి వినిపిస్తుంది. తాజాగా ఆయన ఆలోచన నిజం కాబోతోందని బాలీవుడ్ మీడియా వర్గాలు రాస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది ని బాలీవుడ్ బాధ్షా రీమేక్ చేయబోతున్నారని ఆ వార్తల సారాంశం.
ఈ చిత్రాన్ని తెలుగులో అత్తారింటికి దారేది చిత్రం రూపొందించిన నిర్మాతలు సహ నిర్మాతలు గా వ్యవరిస్తారని, షారూఖ్ స్వయంగా నిర్మించనున్నారని చెప్పుతున్నారు. అలాగే ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైరక్ట్ చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు ఈ చిత్రానికి ఫైనాన్స్ చేయటానికి ఐడిబిఐ బ్యాంక్ ముందుకు వచ్చిందని అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తేలాల్సి ఉంది. చెన్నై ఎక్సప్రెస్ చిత్రం చేసిన నాటి నుంచి షారూఖ్ మాత్రం ఓ దక్షిణాది రీమేక్ లో నటించాలని మాత్రం ఆసక్తి చూపించటం మాత్రం నిజం.

మరో ప్రక్క తెలుగు వారికి ఈగ చిత్రంతో పరిచయమైన సుదీప్ ... రీసెంట్ గా మిర్చి రీమేక్ తో సూపర్ హిట్ కొట్టారు. అదే ఉత్సాహంలో తెలుగులో ఘనవిజయం సాధించిన 'అత్తారింటికి దారేది' రీమేక్ కు పూనుకున్నారు. ఈ కన్నడ రీమేక్ చిత్రీకరణ నగరంలో ఆరంభమైంది. బెంగళూరులోని రాజాజీనగరలోని వినాయకుడి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు. హైదరాబాదులో చిత్రీకరణకు యూనిట్ వెళ్లనుంది. అక్కడ రెండు వారాల పాటు కొనసాగిస్తారు.
అనంతరం బెంగళూరు, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ కొనసాగుతుందని హీరో సుదీప్ తెలిపారు. ఇందులో సుదీప్‌కు జంటగా రచితారాం, హరిప్రియ నటిస్తారు. తెలుగులో నదియా పోషించిన పాత్రకు మధుబాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తెలుగులో వందకోట్లు సాధించిన చిత్రంగా 'అత్తారింటికి దారేది' రికార్డు క్రియేట్ చేసింది. కన్నడంలోనూ అదే హవా కొనసాగిస్తుందని అప్పుడే ట్రేడ్ వర్గాల్లో హడావిడి మొదలైంది.


Click it and Unblock the Notifications











