లవర్‌కు బ్రేకప్ చెప్పి యువ హీరోయిన్ పెళ్లికి సిద్దం.. మరో బిజినెస్‌‌మెన్‌తో డేటింగ్!

హిందీ సినిమా పరిశ్రమకు భారీ విజయాన్ని అందించిన శ్రద్దా కపూర్ కెరీర్ పరంగాను, పర్సనల్ లైఫ్‌లోను ఫుల్‌జోష్‌లో ఉన్నారు. స్త్రీ 2 సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకొన్న ఆమె వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె కొంతకాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన అందాల భామ.. తన డేటింగ్ లైఫ్‌ను బహిరంగం చేశారు. దాంతో ఆమె పెళ్లి చేసుకోబోతుందా? అనే రూమర్లు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

గతంలో శ్రద్దాకపూర్‌ అఫైర్లు, రిలేషన్‌షిప్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పలువురు హీరోలతో డేటింగ్, సహజీవనం వార్తలను ఆమె ఖండించారు. అయినా వాటికి అడ్డుకట్ట పడలేదు. అయితే అప్పుడప్పుడు ముంబైలో యువ హీరోలతో కలిసి డిన్నర్, నైట్ పార్టీలకు వెళ్తూ కనిపించారు. ఓ వైపు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే కెరీర్‌పై ఫోకస్ పెట్టారు.

Is Shraddha Kapoor dating with Delhi Businessman after breakup with Rahul Modi

అయితే ఇటీవల కాలంలో రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వారిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే రంజుగా వారిద్దరి వ్యవహారం కొనసాగుతున్న సమయంలో బ్రేకప్ వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో అందరూ షాక్ గురయ్యారు. అయితే తాజాగా ప్రమోషనల్ ఈవెంట్‌లో తాను డేటింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇటీవల ఓ ఈవెంట్‌లో శ్రద్దాకపూర్ మాట్లాడుతూ.. నేను లవ్‌లో పడ్డాను. నా డేటింగ్ లైఫ్ బాగుంది. నా పార్ట్‌నర్‌‌తో శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. అతడితో కలిసి సినిమాలు చూస్తున్నాను. డిన్నర్స్‌కు వెళ్తున్నాను. ఆయనతో కలిసి ప్రయాణిస్తూ వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నా లవ్ లైఫ్ బాగుంది అని శ్రద్దాకపూర్ చెప్పింది.

అయితే శ్రద్దా ఎవరితో డేటింగ్ చేస్తున్నదనే విషయంపై మీడియా ఆరా తీస్తున్నారు. అయితే ఢిల్లీకి చెందిన బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో పడింది. వారిద్దరూ సహజీవనం చేస్తున్నది. ఆయనతో ఫుల్ జోష్‌తో ఉన్నారు. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే తన పెళ్లి గురించి శ్రద్దా క్లారిటీ కూడా ఇచ్చేసింది.

Is Shraddha Kapoor dating with Delhi Businessman after breakup with Rahul Modi

నా డేటింగ్ లైఫ్ గుడ్ క్వాలిటీతో కొనసాగుతున్నది. పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదు. నేను మ్యారేజ్‌పై నమ్మకం ఉందా? లేదా? అనేది పక్కన పెడితే..నాతో ప్రయాణిస్తున్న వ్యక్తి కరెక్టా? కాదా? అనేది ముఖ్యం. ఎప్పుడూ సరైన వ్యక్తి నా జీవితంలో ఉండాలని కోరుకొంటాను. అయితే పెళ్లిపై రూమర్లు ప్రచారం చేయవద్దని శ్రద్దా తెలిపారు.

శ్రద్దా కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా స్త్రీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా 800 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తాజాగా నాని నటించే తదుపరి చిత్రంలో ఆఫర్ అందుకొన్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో రూమర్‌గా భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X