బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
సెలబ్రిటీల జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఈరోజు ప్రేమలో ఉన్న జంట రేపు విడిపోదు అన్న గ్యారంటీ ఉండదు. అలాగే నిన్న మొన్నటి దాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జంట ఎప్పుడు పెళ్లిని అనౌన్స్ చేస్తారో ఊహించడం కూడా కష్టమే. ఇదంతా ఎందుకంటే తాజాగా శృతిహాసన్ మరోసారి తన బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ వీళ్లిద్దరూ విడిపోయారని రూమర్స్ రావడానికి కారణం ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
పాన్ ఇండియా హీరోయిన్, కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ గత కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లుస్ట్రేటర్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సీక్రెట్స్ ఏమీ మెయింటైన్ చేయలేదు శృతిహాసన్. ఎప్పటికప్పుడు శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసేది.

కానీ గత కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో సందడి చేయడం మానేశారు. దీంతో అసలు మేటర్ ఏంటా అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజెన్లు. తాజా సమాచారం ప్రకారం శాంతను, శృతి హాసన్ మధ్య బ్రేకప్ జరిగిందని తెలుస్తోంది.
అయితే ఈ వార్తలు ఊరికే రావు కదా... నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టుగా ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే విషయం అర్థమైపోతుంది. నిన్న మొన్నటిదాకా ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేయగా, తాజాగా చూస్తే శృతి హాసన్ శాంతను హాజరికను ఫాలో అవ్వడం లేదు.
అతను కూడా శృతిని ఇన్స్టాలో అన్ ఫాలో చేయడం విశేషం. ఇలా ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా శృతి హాసన్ ఏకంగా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి శాంతనుతో దిగిన ఫోటోలను డిలీట్ చేసి పారేసింది.

అయితే సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్ చెప్పుకున్న జంటలు ఇలా చేయడం సర్వసాధారణం. గతంలో నిహారిక, సమంత కూడా ఇదే ట్రిక్ ఫాలో అయ్యారు. డైరెక్ట్ గా బ్రేకప్ అనే విషయాన్ని చెప్పకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యి, రూమర్లు వైరల్ అయిన తర్వాత డివోర్స్ తీసుకున్నాము అంటూ చావు కబుర్లు చల్లగా చెప్పారు.
ఇక ప్రస్తుతం శృతి హాసన్, శాంతను హజారికా ఇద్దరూ వేరే వేరే ఫ్లాట్స్ లో ఉంటున్నారని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. వాస్తవానికి గత నెల రోజుల నుంచి ఇలాగే సాగుతోందట వీళ్ళ వ్యవహారం.
ఇక ఎలాంటి వేడుకకైనా శృతిహాసన్ తనతో శాంతను హాజారికను తీసుకొని వచ్చేది. కానీ తాజాగా హీరామండి ప్రీమియర్ షోకి మాత్రం ఆమె ఒంటరిగా రావడంతో ఈ రూమర్లకు మరింతగా బలం చేకూరింది. మొత్తానికి వీళ్ళ లవ్ స్టోరీ కి బ్రేకప్ పడింది అని తెలుస్తోంది.
అయితే ఇంతకుముందు శృతి హాసన్ ఇటాలియన్ యాక్టర్ మైకేల్ కోర్స్ లేతో కొన్ని నెలలు డేటింగ్ చేసి విడిపోయింది. ఆ తర్వాతే శాంతనుతో ప్రేమలో పడింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా బ్రేకప్ చెప్పుకోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











