ప్రియుడితో బ్రేకప్?.. శృతిహాసన్ డేరింగ్ నిర్ణయం.. అంతా మంచే.. వైరల్‌గా ట్వీట్
అందాల తార, మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతిహాసన్ ఉన్నట్టుంది వెండి తెరకు దూరమైంది. లండన్ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో అఫైర్ కారణంగానే ఆమె పలు అవకాశాలను వదులుకొన్నారనే వార్త సినీ వర్గాల్లో ప్రచారమైంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

కాటమ రాయుడు తర్వాత
వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న శృతిహాసన్ 2017 నుంచి సినిమాల్లో నటించడం మానేసింది. పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన కాటమరాయుడు సినిమాతో పుల్‌స్టాప్ పెట్టేసింది. తన ప్రియుడు మైఖేల్ కోర్సలేని శృతి వివాహం చేసుకోబోతున్నదనే కారణం వినిపించింది. ఆ తర్వాత మైఖేల్‌తో సన్నిహితంగా తిరగడం అందుకు బలం చేకూర్చాయి.

రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ దక్షిణాదిలో శృతిహాసన్ హల్‌చల్ రేపేందుకు రెడీ అవుతున్నదట. సినిమాలకు సంబంధించిన కొత్త స్క్రిప్టులను పరిశీలిస్తున్నదట. గత కొద్ది నెలలుగా సినిమాల ఎంపికపై దృష్టి పెట్టి బిజీగా మారిపోయిందట.

మంచి పని జరిగిందని ట్వీట్
నా విషయంలో చాలా కాలంగా అనుకొంటున్న మంచి పని జరిగిపోయింది. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అదృష్టం నన్ను వెంటాడింది. దేవుడి దీవెనలు నాపై కురిసాయి అని శృతిహాసన్ సోషల్ మీడియాలో స్పందించారు. అయితే ఏం జరిగిందనే విషయంపై శృతి క్లారిటీ ఇవ్వలేదు.

మైఖేల్‌తో బ్రేకప్ జరిగిందా?
శృతి వ్యాఖ్యల నేపథ్యంలో అనేక సందేహాలు తలెత్తాయి. మైఖేల్‌తో అఫైర్‌కు గండిపడిందనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ కారణంగానే మళ్లీ ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నదనే మాట వినిపిస్తున్నది. ఏది ఏమైనా శృతిహాసన్ చెబితే గానీ ఏం జరిగిందో తెలియదంటున్నారు సినీ వర్గాలు.


Click it and Unblock the Notifications











