twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ పేరు చెప్పి టెమ్ట్ చేసి ఒప్పించారు

    By Srikanya
    |

     Is Shruti Haasan the surprise element in Aagadu?
    హైదరాబాద్ : మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' లో వీలైనన్ని సర్పైజ్ లు నింపటానికి దర్శకుడు శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో ఐటం సాంగ్ కు గానూ శృతిహాసన్ ని అడిగినట్లు సమాచారం. మొదట ఆమె ఐటం సాంగ్ అనేసరికి నో చెప్పినా, మహేష్ కోసం ఒప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మేరకు ఆమెకు కోటి రూపాయలు వరకూ పే చేస్తున్నట్లు చెప్తున్నారు. నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి అవుతుంది, అదీ మహేష్ బాబు సరసన అనే సరికి శృతి టెమ్ట్ అయ్యిందంటున్నారు.

    ఈ విషయమై సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేస్తూ..." ఆగడు ఐటం సాంగ్ గురించి ఓ సెన్షేషనల్ న్యూస్ మరి కొద్ది రోజుల్లో చెప్తాం. మా టీమ్ మొత్తం చాలా ఎక్సైంటింగ్ గా ఉన్నాం ". అన్నారు. ఇక కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక.

    పంచ్‌ డైలాగు లేకపోతే.. టీజర్‌, ట్రైలర్‌ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్‌ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం 'ఆగడు' టీజర్‌లో పంచ్‌లపైనే పంచ్‌ వేసేశాడు.
    ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది.

    ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

    'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    SS Thaman tweeted: "Sensational news about Aagadu item song coming up in a couple of days. The whole team is so excited about it". Buzz is that makers of 'Aagadu' has approached Shruti for a special song and the actress didn't take much time to give her nod.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X