విశ్వంభరలో ఆ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే
రాజకీయాలకు ఫుల్‌స్టాప్ చెప్పి.. సినిమాల వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో వరుసపెట్టి సినిమాలు తీస్తూ పోతున్నారు. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళాశంకర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 70కి చేరువ అవుతున్నా ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గడం లేదు. కుర్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా జెట్ స్పీడ్‌తో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు.
ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. చాలా ఏళ్ల తర్వాత చిరు సోషియో ఫాంటసీ జోనర్‌లో నటిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష ఈ మూవీలో చిరంజీవి సరసన ఆడిపాడుతున్నారు. మీనాక్షీ చౌదరి, సురభి, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్, కునాల్ కపూర్, శ్రీ విష్ణు, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్, రావ్ రమేశ్, మృణాల్ ఠాకూర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా విశ్వంభరను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. డబ్బింగ్, మ్యూజిక్ సిట్టింగ్ పనులు కూడా పరుగులు తీస్తున్నాయి. వశిష్ట ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని పనులను చక్కబెడుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని చిరంజీవి నివాసంలో విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణితో పాటు పలువురు సింగర్స్ అక్కడ మకాం వేశారు. మహేశ్ - రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి బోల్డెంత టైమ్ ఉండటంతో క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వాలని కీరవాణి డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.
మరోవైపు.. చిరంజీవి గత చిత్రాలు గాడ్ ఫాడర్, ఆచార్య, భోళా శంకర్‌లు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో విశ్వంభర విషయంలో మెగా కాంపౌండ్ స్పెషల్ కేర్ తీసుకుంటోంది. మెగాస్టార్ సినిమా అనగానే ప్రేక్షకులు చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అందుకు అనుగుణంగానే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఓ ఐటెం సాంగ్ ఉంటుందని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ స్పెషల్ నెంబర్ కోసం ఓ స్టార్ హీరోయిన్‌ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఆమె ఎవరో కాదు .. లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతీ హాసన్. గతంలోనూ శృతి చేసిన ఐటెం సాంగ్స్ మాస్ జనాలను ఒక ఊపు ఊపాయి. స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా నటిస్తూనే స్పెషల్ సాంగ్స్‌తోనూ ఆమె దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలోనే విశ్వంభర కోసం శృతిని మేకర్స్ సంప్రదించడం ఆమె ఓకే చెప్పారని, త్వరలోనే శృతి హాసన్ ఈ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ విశ్వంభరలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేస్తే మాత్రం బాక్స్‌లు బద్ధలవ్వాల్సిందే.


Click it and Unblock the Notifications











