హాట్ టాపిక్: రాత్రంతా ఆమెతో గడిపిన హృతిక్

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఒక రాత్రంతా హాలీవుడ్ బ్యూటీ పారిస్ హిల్టన్‌తో దుబాయ్‌లో గడపడం చర్చనీయాంశం అయింది. త్వరలో ఆమె హృతిక్ సరసన ఏదైనా బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరూ కాస్త చనువుగా మూవ్ అవ్వడంతో ప్రేమలో పడ్డారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

హృతిక్ రోషన్ గురించి పారిస్ హిల్టన్ మాట్లాడుతూ అతనితో కలిసి బాలీవుడ్ సినిమాలో నటించాలని ఉందనే తన మనసులోని మాటను బయట పెట్టింది. ‘హృతిక్ రోషన్ జెంటిల్మెన్, వెరీ స్వీట్ అండ్ చార్మింగ్. అతనితో కలిసి ఒక రాత్రంతా గడిపాను. బాలీవుడ్ గురించి హృతిక్ రోషన్ గురించి చాలా విన్నాను. త్వరలోనే ఇండియా వస్తాను' అంటూ పారిస్ హిల్టన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

Is Single Hrithik Roshan Ready To Mingle With Paris Hilton?

హృతిక్ రోషన్ కూడా పారిస్ హిల్టన్‌తో కలిసి దిగిన ఫోటో ఒకటి తన ట్విట్టర్లో పోస్టు చేసాడు. ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. దీన్ని బట్టి త్వరలో హృతిక్ రోషన్ సినిమాలో పారిస్ హిల్టన్ నటించే అవకాశం ఉందనే వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది. గతంలో హాలీవుడ్ భామలను తన సినిమాల్లో నటింపజేసిన హృతిక్ రోషన్...పారిస్ హిల్టన్‌తో రొమాన్స్ చయడం పెద్ద విషయమేమీ కాదు.

ఇక....హృతిక్ రోషన్ నటించిన బ్యాంగ్ బ్యాంగ్ సినిమా విషయానికొస్తే, సినిమా అంత గొప్పలేదనే టాక్ వచ్చినప్పటికీ, హృతిక్ రోషన్ సినిమాలకు ఉన్న క్రేజ్‌తో వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం రూ. 200 కోట్ల వసూళ్లను అధిగమించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X