Sitara: సినిమాల్లోకి సితార ఘట్టమనేని.. మహేష్ బాబు కూతురు ఏ ఇండస్ట్రీని ఎంట్రీ అంటే?
సితార ఘట్టమనేని.. రాబోయే తరానికి కాబోయే స్టార్ హీరోయిన్ అని అభిమానులు ఎంతో ఆశ పడుతున్నారు. కానీ, ఈ ఆశ అడియాశలు అయ్యేలా అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా.. తెలుసుకుందాం రండి.
సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత ముద్దుల కూతురు సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొడుకు గౌతమ్ ఉన్నా కూడా సెలబ్రిటీ స్టేటస్ ను మొత్తం సితార నే అందుకుంది. పోస్టులు పెట్టడం, డ్యాన్స్ లు వేయడం, ఫోటోషూట్స్ తో సితార ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.

ఇక పదేళ్లకే ఈ చిన్నది ఇంటర్నేషనల్ జ్యువలరీ యా లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఆ యాడ్ వలన సంపాదించిన డబ్బును డొనేట్ చేసి మహేష్ బాబు కూతురు అనిపించుకుంది. అందానికి అందం.. వ్యక్తిత్వానికి వ్యక్తిత్వం.. ఇక ఈ చిన్నదానికి తెలుగులో తిరుగులేదు అనుకున్నారు. 11 ఏళ్లకే సితార.. హీరోయిన్లను మించిన అందంతో షాక్ ఇస్తుంది. ఒకపక్క డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఇంకోపక్క చదువును ఫినిష్ చేస్తుంది.
ఇక సోషల్ మీడియా అమ్మడి హల్చల్ మామూలుగా చేయదు. తండ్రి మహేష్ తో షోస్ కు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన స్థాయిని పెంచుకుంటుంది. తాను తన తల్లిదండ్రులా బాటలోనే హీరోయిన్ గా రాణించాలని కోరుకుంటున్నట్లు సితార ఎప్పుడో చెప్పేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఘట్టమనేని వారసురాలు.. ఏకంగా డెబ్యూ నే హాలీవుడ్ లో ఇవ్వాలని ప్లాన్ చేస్తుందట.
అవును.. మీరు విన్నది నిజమే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సితార తన మనసులో మాట బయటపెట్టింది. " చిన్నప్పటి నుంచి నాన్నని చూసి పెరగడం వల్ల సినిమాలంటే నాక్కూడా ఆసక్తి కలిగింది. నాకు సినిమాల్లోకి రావాలని ఉంది. అయితే ఇంగ్లీష్ సినిమాల్లోనే నటించాలనుకుంటున్నా" అంటూ చెప్పకనే చెప్పింది. దీంతో సితార.. టాలీవుడ్, బాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశం లేదు అని తెలుస్తుంది..అంతేకాకుండా తన కెరీర్ మీద ఈ చిన్నది ఇప్పటికే ఒక మంచి క్లారిటీతో ఉందని అర్థమవుతుంది.

ఇక హాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ..ఈ మధ్యనే అవంతిక వందనపు అనే తెలుగు అమ్మాయి హాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ సైతం ప్రసంసిస్తున్న విషయం తెల్సిందే. అంతేకాకుండా తెలుగువారు సైతం హాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలో సితార హాలీవుడ్ వైపు తొంగిచూడడం తప్పేమీ కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. మహేష్ బాబు తలుచుకుంటే.. సితార హాలీవుడ్ ఎంట్రీ ఎంతసేపు అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి సితార పాప హాలీవుడ్ ఎంట్రీ ఏ ఏడాదిలో ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











