శోభిత ధూళిపాల ప్రెగ్నెంట్? తండ్రి కాబోతున్న నాగచైతన్య!
అక్కినేని నట వారసుడు నాగచైతన్య ఇటీవల తండేల్ మూవీతో భారీ విజయాన్ని అందుకొని తన కెరీర్‌లో బెస్ట్ ఫెర్మార్మెన్స్‌ను ఇచ్చారు. అక్కినేని అభిమానుల్లో చైతూ ఇటీవల కాలంలో సంతోషకరమైన వార్తలు చాలానే అందించారు. తండేల్ విజయం తర్వాత ఓ హిస్టారికల్ మూవీని ప్రారంభించి మరో హ్యాపీ న్యూస్ అందించారు. అయితే ఈ మధ్య వివాహం చేసుకొన్న ఈ యువ హీరో త్వరలోనే తండ్రి కాబోతున్నాడనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గత రెండేళ్లుగా నాగచైతన్య పర్సనల్ లైఫ్ అనేక ఆటుపోట్లకు గురైంది. సమంతతో దాంపత్య జీవితం విఫలం కావడం, అలాగే తాను నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరిగా ఆకట్టుకోలేకపోవడం తన ఫ్యామిలీని, అభిమానులను గందరగోళానికి గురి చేసింది. అయితే సమంతతో మ్యారేజ్ బ్రేకప్ తర్వాత మళ్లీ త్వరగానే తన లైఫ్‌ను చక్కదిద్దుకోవడంతో సరైన ట్రాక్‌లోకి వచ్చాడనే విషయం స్పష్టమైంది.

సమంతతో బ్రేకప్ నుంచి తేరుకొని వెంటనే శోభిత ధూళిపాలతో ప్రేమలో పడటంతో తన పర్సనల్ లైఫ్‌ను చక్కదిద్దుకొన్నాడు. తమ ప్రేమను చైతూ, శోభిత ఇద్దరు కూడా ఇరు ఫ్యామిలీలను ఒప్పించి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకొన్నారు. దాంతో వారి దాంపత్య జీవితానికి మార్గం సుగమమైంది. పెద్దల అంగీకారంతో సీక్రెట్‌గా నిశ్చితార్థం జరుపుకొని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించారు.
అక్కినేని, ధూళిపాల కుటుంబాల ఆమోదంతోపాటు స్నేహితులు, సన్నిహితుల ఆశిస్సులతో డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన వివాహ కార్యక్రమంలో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారిద్దరూ తమ కుటుంబంలోకి చిన్నారిని ఆహ్వానించడానికి నిర్ణయం తీసుకొన్నారనేది తాజాగా ప్రచారంలో ఉన్న ఓ వార్త స్పష్టం చేసింది.
అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ప్రకారం.. శోభిత ధూళిపాల త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. నాగచైతన్య తండ్రి కాబోతున్నారు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ వార్తపై అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ ధూళిపాల కుటుంబం నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ వార్త వాస్తవమేనా? లేక రూమరా? అనే విషయం సందిగ్దంగా మారింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వస్తే.. ఫ్యాన్స్‌లో సంబరాలు ఊపందుకొంటాయని సినీ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











