ప్రియుడితో పెళ్లికి సిద్ధమవుతున్న హీరామండి హీరోయిన్
గత కొన్ని నెలలుగా బాలీవుడ్ లో ఉత్కంఠకర వాతావరణం నెలకొంది. సీనియర్ హీరోయిన్లు, పలువురు ప్రముఖ నటీనటులు వరుసగా పెళ్లి చేసుకుంటూ అభిమానులకు తీపి వార్తను అందిస్తున్నారు. తాజాగా సోనాక్షి సిన్హా కూడా ఓ ఇంటికి కోడలు కాబోతోందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ బ్యూటీ ఎవరిని పెళ్లాడబోతోంది? అనే విషయంపై ఒక లుక్కేద్దాం.
రీసెంట్ గా హీరామండి సిరీస్ తో హిట్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన ప్రియుడిని పెళ్లాడబోతోంది అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే ఆమె పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయని తెలుస్తోంది. ఇక సోనాక్షి సిన్హా చేతికి డైమండ్ రింగ్ కనిపించడంతో ఎంగేజ్మెంట్ ను సీక్రెట్ గా జరిపించారని టాక్ నడుస్తోంది.

హిరామండి ప్రమోషన్‌లో భాగంగా సోనాక్షి 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో తాను పెళ్లి కోసం ఎదురు చూస్తున్నానంటూ ప్రకటించింది. అప్పటి నుంచే ఆమె పెళ్లి వార్తలపై చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు మొత్తానికి పెళ్లికి సిద్ధమైంది ఈ బ్యూటీ. మరి ఆమె ప్రియుడు ఎవరు? పెళ్లి ఎప్పుడు? అనే అసలు విషయాలోకి వెళ్తే..
ప్రముఖ బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా కూతురైన సోనాక్షి సిన్హా పెళ్లి ఖరారైనట్టు సమాచారం. పెళ్లి తేదీతో పాటు వేదిక వివరాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె తన ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడబోతోందని, ఈ పెళ్లి కోసం సోనాక్షి హిందూ మతాన్ని వదిలి ముస్లిం మతాన్ని స్వీకరించబోతోందని అంటున్నారు.

పెళ్లి కూడా ముస్లిం పద్దతిలోనే జరగనుందని టాక్ నడుస్తోంది. సోనాక్షి, జహీర్ ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంట తరచుగా పార్టీలలో కలిసి కనిపిస్తారు. జూన్ 2న సోనాక్షి పుట్టినరోజు సందర్భంగా ఆమెను సోషల్ మీడియా వేదికగా జహీర్ విష్ చేశాడు కూడా. కాగా సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జూన్ 23న పెళ్లి బంధంలోకి అడుగు పెట్టనున్నారు అని సమాచారం.
ఈ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ముఖ్యంగా సోనాక్షి 'హిరామండి' సిరీస్ నటీనటులందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ పెళ్లికి ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా వ్యతిరేకమని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు తన కూతురు ఇష్టానికి తలొగ్గి జహీర్ ఇక్బాల్‌ని అల్లుడుగా చేసుకోవడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. సోనాక్షి సిన్హా వివాహ వేడుక ముంబైలోని బాస్టియన్‌లో జరగనుందని, అతిథులను ఫార్మల్ డ్రెస్‌లో రావాలని కోరారని సమాచారం.


Click it and Unblock the Notifications