పెళ్లి కాకుండానే స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. అలా రెడ్ హ్యాండెడ్‌గా మీడియాకు చిక్కిన బ్యూటీ!
గత కొద్ది రోజులుగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కంటిన్యూగా ట్రెండింగ్‌లో ఉంటూ వస్తున్నది. ఆమె నటించిన హీరామండి వెబ్ సిరీస్‌లో రిలీజ్ కావడం.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ రేపింది. తాజాగా పెళ్లి చేసుకొన్న ఆమె గురించి మీడియాలో వస్తున్న వార్త ప్రస్తుతం మరింత చర్చనీయాంశమైంది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
సోనాక్షి సిన్హా తాను ఏడేళ్లుగా ప్రేమిస్తూ డేటింగ్ చేస్తున్న నటుడు జహీరో ఇక్బాల్‌ను కుటుంబ అంగీకారంతో వివాహం చేసుకొన్నారు. జూన్ 23వ తేదీన వీరిద్దరి వివాహం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా జరిగింది. మేమిద్దరం కలిసి జీవనం కొనసాగిస్తామని అంగీకార పత్రంపై సంతకం చేసి జీవిత భాగస్వామ్యులయ్యారు.

ఇక ఇస్లాం మతానికి చెందిన వ్యక్తికి కూతురును ఎలా వివాహం చేస్తారని ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్, బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా అలియాస్ షాట్‌గన్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. లవ్ జిహద్ అంటూ సోనాక్షిని కూడా పోస్టులు పెట్టి వేధించారు. అయితే ఎలాంటి గొడవ లేకుండా వారిద్దరి పెళ్లి జరిగింది.
పెళ్లి తర్వాత హానిమూన్‌కు వెళ్తారనుకొంటే.. సోనాక్షి, ఇక్బాల్ మాత్రం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌కు వెళ్తూ కారులో మీడియా ఫోటోగ్రాఫర్ల కంటపడ్డారు. దాంతో రకరకాల ఊహగానాలు సోషల్ మీడియాలో చెలరేగాయి. దాంతో ట్విట్టర్‌లో ఆమె ట్రెండింగ్‌లోకి వచ్చింది.
సోనాక్షి హాస్పిటల్‌కు వెళ్లడంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ వదిలారు. ఆమె గర్బం దాల్చిందనే వార్త వైరల్ అయింది. అయితే ఓ నెటిజన్ రొటీన్ మెడికల్ చెకప్ మాత్రమే అంటూ కామెంట్ చేశాడు. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయినా శుభవార్తే.. పెళ్లికాకుండానే ఆమె గర్బవతి అయి ఉంటుందనే కామెంట్ చేశాడు. ఇక త్వరలోనే చిన్నారి వస్తున్నది అంటూ నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. అయితే ప్రెగ్నెంట్ అయిందా? లేదా? రొటిన్ చెకపా? అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

సోనాక్షి సిన్హా కెరీర్ విషయానికి వస్తే.. బడే మియా చోటే మియా చిత్రంలో స్పెషల్ రోల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే హీరామండి వెబ్ సిరీస్‌లో పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం కాకుండా అనే చిత్రంలోను, అలాగే నికితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్ అనే చిత్రంలోను నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











