మెగా హీరో మూవీ నుంచి శ్రీలీల అవుట్? కారణం అదేనా?
ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా లోనే కాకుండా సౌత్ సినిమా దగ్గర కూడా మోస్ట్ ట్రెండింగ్ యంగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల అని చెప్పవచ్చు. తెలుగులో ఒక డీసెంట్ డీసెంట్ డెబ్యూ ఇచ్చిన తర్వాత మాస్ మహారాజ రవితేజతో ధమాకా అనే సినిమా చేసి సెన్సేషనల్ హిట్ ని శ్రీలీల కొట్టి తెలుగు సినిమాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యిపోయింది.
ఆ ఒక్క హిట్ సినిమా తర్వాత శ్రీలీలకి వద్దన్నా వరుస ఆఫర్స్ వరదలా వచ్చి పడ్డాయి. ఇలా ఒకేసారి ఏకంగా పదేసి సినిమాలు కూడా ఓకే చేసేసింది ఈ అమ్మడు. కాగా అక్కడ నుంచి ఓకే చేసిన సినిమాల్లో మన సీనియర్ స్టార్ హీరోస్ తో సినిమాలు కూడా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే తన కెరీర్ బిగ్గెస్ట్ ఆఫర్లు కూడా వాటిలో ఉన్నాయి.

శ్రీలీల ఇపుడు వరకు చాలా మంది సరసన నటించింది కానీ ఆమె కెరీర్లో నటించిన బిగ్ స్టార్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పవచ్చు. తనతో చేసిన గుంటూరు కారం తో ఆమె అలరించగా ఈ సినిమా కాకుండా మరో బిగ్ ప్రాజెక్ట్ అది కూడా బిగ్ స్టార్ తో ఉంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న అవైటెడ్ సినిమా "ఉస్తాద్ భగత్ సింగ్".
దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఒకటీ రెండు షెడ్యూల్స్ కూడా మేకర్స్ చేశారు. వీటిలో శ్రీలీల కూడా పాల్గొంది. కానీ ఇపుడు ఈ బిగ్ ప్రాజెక్ట్ ని వదులుకుంటే బెటర్ అని శ్రీలీల ఆలోచిస్తున్నట్టుగా పలు పుకార్లు వినిపిస్తున్నాయి.

తాను ఈ సినిమాకి మిగతా సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసి కాల్షీట్స్ ఇచ్చింది కానీ ఇప్పటికీ సినిమా ముందు వెళ్లకపోతుండడంతో శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఆలస్యం అవ్వడంతో ఇక ముందు ఎప్పుడు ఈ సినిమా మొదలు అవుతుందో కూడా క్లారిటీ లేకపోవడం, పైగా ఒకవేళ ఇది మొదలైతే మరో సినిమాకి ఇచ్చిన డేట్స్ మళ్ళీ ఇబ్బందికరంగా మారుతాయేమో అని శ్రీలీల ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది వేచి చూడాలి. కాగా లాస్ట్ టైం కూడా ఇదే ప్రాజెక్ట్ కాకపోతే భవదీయుడు భగత్ సింగ్ కి మొదట పూజా హెగ్డేని అందుకుంటే అది కూడా బాగా ఆలస్యం కావడంతో పూజా హెగ్డే తప్పుకుంది. ఆమె ప్లేస్ లో ఇపుడు శ్రీలీల వస్తే ఇపుడు ఈమె కూడా వెనక్కి వెళ్లేలా ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ సినిమా విషయంలో ఏమవుతుంది అనేది. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











