వైసీపీ నేతతో శ్రీరెడ్డి పెళ్లి?.. కొన్నేళ్లుగా చెన్నైలో సహజీవనం?!
వివాదాస్పద నటి శ్రీరెడ్డి త్వరలో వివాహం చేసుకోబోతున్నదనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గత ఐదేళ్లకుపైగా చెన్నైలో నివస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ నేత, వైసీపీ నేతకు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారని కొందరు అంటే.. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. అయితే ఆమె కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనధికారిక ప్రతినిధిగా మాట్లాడుతుండటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే శ్రీరెడ్డి పెళ్లి గురించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో మీటూ ఉద్యమాన్ని ప్రారంభించి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్న నటిగా శ్రీరెడ్డికి పేరుంది. ఆమె సినీ పరిశ్రమలో కొందరి తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద నగ్నంగా ప్రదర్శన చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ధాంతో ఆమె మరింత పాపులారిటీ సంపాదించుకొన్నది.

ఇక తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి తన మకాం మార్చింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలోను, అలాగే యూట్యూబ్‌లో వివాదాస్పద, అశ్లీల వీడియోలతో యువకులకు మంచి వినోదాన్ని పంచింది. ఇక సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఆమె.. జనసేన, తెలుగు దేశం పార్టీలను తూర్పార పట్టింది.
అయితే గత కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు ఏదో అడిగితే.. శ్రీరెడ్డి సిగ్గుపడుతూ.. ఈ విషయం తెలిస్తే.. బైరెడ్డి సిద్దార్త్ నీ చేయి తీసేస్తాడని వార్నింగ్ ఇచ్చింది. దాంతో శ్రీరెడ్డికి, ఆ నేతకు ఏదైనా రిలేషన్ ఉందా? అనే అనుమానం తలెత్తింది. అయితే తాజాగా శ్రీరెడ్డి పెళ్లి చేసుకోబోతుందనే వార్త బయటకు రావడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే గతంలో అభిరామ్ దగ్గుబాటితో రిలేషన్ పెట్టుకొన్నట్టు స్వయంగా శ్రీరెడ్డి వెల్లడించింది. ఆ వివాదం చాలా రోజుల కొనసాగిన తర్వాత ఇటీవల సద్దు మణిగింది. అలాగే పలు హీరోలు, దర్శకులతో శారీరక సంబంధాలు ఉన్నాయని స్యయంగా ఆమె వీడియో రిలీజ్ చేసింది.
ఈ క్రమంలో శ్రీరెడ్డి వివాహం చేసుకొంటుందా? అనే వార్తపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతతో ఆమెకు నిజంగా సంబంధాలు ఉన్నాయా? లేక ఇది రూమరేనా అనే విషయంపై శ్రీరెడ్డి వివరణ ఇస్తే ఇలాంటి గాసిప్ వార్తలకు తెరపడే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











