చిరు ఫ్యామిలితో శ్రీకాంత్ కు వైరమేంటి..?
అన్నయ్య అన్నయ్య అంటూ చిరంజీవి చుట్టూ తిరగుతుంటాడు శ్రీకాంత్. నా సొంత తమ్ముడిలాంటి వాడు అని శ్రీకాంత్ ను ఉద్దేశించి చిరంజీవి చెబుతుంటాడు. అయితే ఈ అన్నదమ్ముల ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొనే అవకాశం ఉందని ఉహాగాలనాలు రేగుతున్నాయి. విషయం ఏటంటే శ్రీకాంత్ నటించిన 'రంగా ది దొంగ" ఈ 30న విడుదలకానుంది.
ప్రస్తుతం 'ఆరెంజ్" రన్ అవుతోన్న దేవి70యమ్ యమ్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతో 'ఆరెంజ్" చిత్రాన్ని 50రోజులు పూర్తవ్వకుండానే ఎత్తి వేయాల్సిన పరిస్థితి రానుంది. మామూలుగా పెద్ద సినిమాలను బలవంతంగా 50రోజుల పాటు థియేటర్లలో ఉంచుతారు. కానీ 'రంగా ది దొంగ" కారణంగా 'ఆరెంజ్" ఈ థియేటర్ లో హఫ్ సెంచురీ కొట్టకుండానే తోక ముడవబోతుంది. మరి చిరు కుటుంబం, చిరు అభిమానులు ఈ విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటారో?లేదో వేచి చూడాల్సిందే.
More from Filmibeat
శ్రీకాంత్ రంగా ది దొంగ ఆరెంజ్ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి srikanth ranga the donga orange ram charan teja chiranjeevi


Click it and Unblock the Notifications











