రాజమౌళి కండిషన్స్.. డైలామాలో ప్రియాంక చోప్రా.. మహేష్‌తో ఉన్నట్టా? లేనట్టా?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరో క్రేజీ ప్రాజెక్టును గ్రాండ్‌గా మొదలుపెట్టారు. RRR సినిమా తర్వాత పక్కాగా రాసుకొన్న స్క్రిప్టుతో గ్లోబల్ ట్రాటింగ్ కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తన కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ సరసన ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా సెట్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆమెను కన్ఫర్మ్ చేయలేదనే విషయం ఫ్యాన్స్‌కు షాకింగ్ కలిగించే అంశంగా మారింది. ఈ క్రేజీ వార్త గురించిన వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా రంగంలో ఇప్పటి వరకు ప్యాన్ ఇండియా మూవీస్‌కే పరిమితమైన రాజమౌళి ఈ సారి మరోసారి ప్రపంచ సినిమా ప్రేక్షకులకు భారీ సినిమాను అందించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ సినిమాకు కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు కెరీర్‌లో 29వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్నది.

ఇదిలా ఉండగా, గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో సినిమాలు చేసుకొంటున్నారు. అయితే ఆమెను ఈ సినిమాలో భాగం చేస్తున్నారనే వార్తల మధ్య ఆమె నేరుగా హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితం ల్యాండ్ అయింది. దాంతో జక్కన్న సినిమాలో ప్రియాంక ఖాయమనే మాట వినిపించింది. అయితే ఆమె మూడు, నాలుగు రోజులు భాగ్యనగరంలో ఉండటంతో అలాంటి అనుమానాలకు క్లారిటీ వచ్చేసింది.
ఇక హైదరాబాద్‌లో ప్రియాంక బిజీ బిజీగా ఉన్నారనేది ఆమె పర్యటనతో అర్ధమైంది. జక్కన్న టీమ్ ఆమెకు లుక్ టెస్ట్, ఆడిషన్స్ నిర్వహించారని సమాచారం. అయితే రాజమౌళి నిర్వహించిన లుక్ టెస్ట్, ఆడిషన్స్‌లో ఆమె పాస్ అయ్యారనేది చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమెను హీరోయిన్‌గా ఈ సినిమాలో తీసుకోవడానికి రాజమౌళి కొన్ని కండిషన్లు పెట్టడం ట్విస్టుగా మారిందని చెప్పుకొంటున్నారు.
అయితే హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రాజమౌళి తన సినిమా కోసం భారీగా డేట్స్ ఇవ్వాలని సూచించారట. తన సినిమా షూట్ జరిగే సమయంలో ఎప్పుడు అడిగితే.. అప్పుడు షూటింగు వచ్చే వెసులు బాటు ఉండేలా డేట్స్ ఇవ్వాలని కండిషన్ పెట్టారట. దాంతో ఆమె ప్రస్తుతం డైలామాలో ఉన్నారు. దాంతో ఆమె డిసైడ్ కావడానికి, డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంత సమయం కోరిందట. ఒక్కసారి బల్క్ డేట్స్ విషయంలో ప్రియాంక చోప్రా క్లారిటీ ఇస్తే.. SSMB29 సినిమాలో ఆమె చేరిపోయినట్టే అని చిత్ర యూనిట్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











