రాజమౌళి చేతుల్లో నలిగిపోతున్న మిల్కీ బాయ్.. ఇక మూడేళ్లు భరించాల్సిందే...!

SSMB 29: సూపర్ స్టార్ మ‌హేశ్‌బాబు - క్రియేటివ్ డైరెక్టర్ రాజ‌మౌళి కాంబోలో వస్తున్న కొత్త మూవీ SSMB 29. ఈ మూవీకి ఇంకా పేరు పెట్టక‌పోయినా.. SSMB 29గా ఫేమ‌స్ అయిపోయింది. ఈ మూవీ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినిమా ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా పూజ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. డైరెక్టర్ రాజమౌళి చేతుల్లో మహేశ్ బాబు నలిగిపోతున్నారంట. ఇంతకీ ఏం జరిగింది?

సాధారణంగానే రాజ‌మౌళి సినిమా అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో అంటే భారీ అంచ‌నాలు పెరిగాయి. సినిమా కోసం మ‌హేష్ త‌న లూక్‌ని మార్చేశారు. పొడ‌వాటి జుట్టుతో జుంపాలు పెంచుకుని.. చాలా హాండ్‌స‌మ్‌గా క‌నిపిస్తున్నారు. తాజాగా.. ఈ పాన్ వరల్డ్ మూవీ పూజ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి మహేశ్ తన సెంటిమెంట్స్ ను బ్రేక్ చేసి మరీ హాజరయ్యారు. హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని ఓ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా పూజ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

Is SS Rajamouli giving martial arts training to mahesh babu For SSMB 29

ముఖ్యంగా ఈ మూవీ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి మ‌హేష్ బాబు ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. అంతేకాదు.. మ‌హేష్ బాబుకు ఇది తొలి పాన్ ఇండియా మూవీ కావ‌డం విశేషం. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన ప్రియాంకా చోప్రా న‌టిస్తున్నట్లు స‌మాచారం. అలాగే.. మరోవైపు మ‌ళ‌యాల స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమార‌న్ ప్రతినాయకుడుగా గా న‌టిస్తున్నాడ‌నే టాక్ న‌డుస్తోంది.

ఇక SSMB29 సినిమా షూటింగ్ ఆఫ్రికా సహా ప్రపంచంలోని పలు దేశాలలో షూటింగ్‌ చేయబోతున్నారంట. అలాగే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నికల్ టీం కూడా పని చేయనున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా కోసం 1000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే.. ఈ సినిమాను రెండు పార్ట్స్‌లో విడుద‌ల కానున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. పార్ట్ 1 2027లో, పార్ట్ 2 -2029లో రాబోతున్నట్టు సినీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.

Is SS Rajamouli giving martial arts training to mahesh babu For SSMB 29

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారట. ఇప్పటివరకు మేకోవర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు రాజమౌళి. ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉండటంతో మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన కొన్ని బేసిక్ టెక్నిక్స్ అయినా తెలుసుకోవాలనీ, ఇందుకోసం హాలీవుడ్ నుంచి వచ్చిన కొంతమంది స్పెషల్ ట్రైయినర్స్ తో మహేష్ బాబుకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారట.

అంతకుముందు .. బాహుబలి సమయంలో ప్రభాస్, రానాలకు హార్స్ రైడింగ్, కర్ర సాము కత్తి సామూలాంటివి నేర్పించిన విషయం తెలిసిందే. అలాగే.. తాజాగా.. మహేష్ బాబుకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం మహేష్ బాబును విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం నెట్టింట్లో వైరల్ కావడంతో రాజమౌళి సినిమా అంటే మామూలుగా ఉండదుగా.. మరో మూడేంళ్లు ఈ కష్టాలు తప్పవంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: mahesh babu rajamouli ssmb 29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X