పవర్ ఫుల్‌గా RRR‌.. దద్దరిల్లే టైటిల్‌తో రాజమౌళి

Recommended Video

RRR Movie : SS Rajamouli Reveals The Abbreviation Of Title | Filmibeat Telugu

బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సెట్స్‌పైకి వచ్చాడు రాజమౌళి. సంచలన విజయం తర్వాత మరోసారి మల్టీస్టారర్‌కే ఓటు వేశాడు జక్కన. బాహుబలి కోసం ప్రభాస్, రానా దగ్గుబాటిని కలిపిన అగ్రదర్శకుడు తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చారు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాకరీ వేదికగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు రోజుకొకటి మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 పవర్‌ఫుల్, క్రేజీ టైటిల్‌తో

పవర్‌ఫుల్, క్రేజీ టైటిల్‌తో

RRR అనే తాత్కాలిక టైటిల్‌ సోషల్ మీడియా, మీడియాలో విస్త్రృతంగా ప్రచారమవుతన్నది. ఆంగ్ల అక్షరాల వెనుక అసలైన టైటిల్ ఉందని చెప్పుకొంటున్నారు. RRR అంటే రామరావణ రాజ్యం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తున్నది.

హై ఎండ్ యాక్షన్ సీన్లు

హై ఎండ్ యాక్షన్ సీన్లు

రామ రావణ రాజ్యం టైటిల్‌కు తగినట్టే ఈ చిత్రంలో హై ఎండ్ యాక్షన్ సీన్లు ఉంటాయట. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలను తొలి షెడ్యూల్‌లో 45 రోజుల పాటు చిత్రీకరించేందుకు షూటింగ్‌ను ప్లనా్ చేశారు. ఈ షెడ్యూల్‌లో రాంచరణ్, ఎన్టీఆర్ పాల్గొంటారని తెలిసింది.

ఎన్టీఆర్ పాత్ర పవర్‌ఫుల్‌గా

ఎన్టీఆర్ పాత్ర పవర్‌ఫుల్‌గా

RRR చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందట. ఈ పాత్ర రూపురేఖలను తీర్చిదిద్దేందుకు లాయిడ్ స్టీవెన్‌ను రంగంలోకి దించారట. అంతేకాకుండా అరవింద సమేతలోని యాక్షన్ సీన్లను మించి సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు.

విదేశీ భామ స్పెషల్ ఎట్రాక్షన్

విదేశీ భామ స్పెషల్ ఎట్రాక్షన్

ఇక RRR చిత్రంలో గ్లామర్ డోసేజ్ ఎక్కువగానే ఉంటుందంట. ఈ చిత్రంలో కనీసం ముగ్గురు హీరోయిన్లు గ్యారెంటీ అని చెబుతున్నారు. అందులో ఓ విదేశీ భామను ముగ్గులోకి దించినట్టు తెలుస్తున్నది.

2020 వేసవికి రిలీజ్

2020 వేసవికి రిలీజ్

ఓ వైపు RRR షూటింగ్‌ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చేపట్టే విధంగా ప్రొడక్షన్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. నటీనటుల ఎంపిక శరవేగంగా సాగుతున్నది. అంత సవ్యంగా సాగితే 2020 వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X