వారణాసి మూవీలో పాన్ ఇండియా స్టార్.. మహేష్ కోసం జక్కన్న ప్లాన్ అదిరిపోయేలా!
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.
ఈ సినిమాకు కథ, మాటల సహకారాన్ని దేవకట్టా అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా తమ్మిరాజు, ఫైట్స్ కింగ్ సాల్మన్, సినిమాటోగ్రఫిని ఎస్ గోపాల్ రెడ్డి, పీఎస్ వినోద్ అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ తర్వాత అనేక రకాల వివాదాల్లో నలుగుతున్నది.

అయితే చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకొంటూ పోతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మూవీలో చేరుతున్న నటీనటుల చేరిక అంచనాలు పెంచేలా చేస్తున్నది. ఈ సినిమాలో మరో స్టార్ హీరోను రంగంలోకి రాజమౌళి దించుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
వారణాసి సినిమాలో రాముడిగా మహేష్ బాబు, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ సినిమాలో కుంభ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇంకా ఈ చిత్రంలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో హనుమాన్ కీలక పాత్రగా ఉండబోతుందనే విషయం తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. అంజనేయుడి పాత్ర కోసం జక్కన టీమ్ పలువురు హీరోల పేర్లను పరిశీలించారు. అయితే చివరకు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్న స్టార్ హీరో ఆర్ మాధవన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటం మరింత ఆసక్తిని రేపుతున్నది.
వారణాసి చిత్రంలోని హనుమాన్ పాత్ర కోసం ఆర్ మాధవన్‌ను చిత్ర యూనిట్ సంప్రదించింది. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను దృష్టి పెట్టుకొని ఆయన కూడా నటించేందుకు ఒప్పుకొన్నారు. ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉందనే విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











