Divorce: భార్యకు విడాకులిచ్చి.. స్టార్ హీరోయిన్‌తో పెళ్లికి సిద్దమవుతున్న టాప్ డైరెక్టర్
సినిమా పరిశ్రమలో వివాహేతర సంబంధాలు సర్వసాధారణమైపోతున్నాయి. సినిమాల్లో నటించే తారలతో ప్రేమలో పడటం ఇప్పటి నుంచి జరుగుతున్న విషయం కాదనే విషయం తెలిసిందే. అయితే పెళ్లిన హీరోలు రెండో పెళ్లి చేసుకోవడం, లేదా పెళ్లిన వారు తమ జీవిత భాగస్వాములకు విడాకులిచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం తెలిసిందే. అయితే తాజాగా సినీ పరిశ్రమలో ఇప్పటికే విడాకులిచ్చి సింగిల్‌గా ఉంటున్న స్టార్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ పెళ్లికి సిద్దమవుతున్నట్టు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలో అగ్రహీరోలందరితో నటించిన స్టార్ హీరోయిన్‌గా మ్యారేజ్ బ్రేకప్ అయి ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తనదైన శైలిలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వాటికి ఆమె పెద్దగా స్పందించకుండా, వాటిని పట్టించుకోకుండా తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

అయితే ఇటీవల ఆ స్టార్ హీరోయిన్ గురించి దక్షిణాది మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తున్నది. అయితే వెబ్ సిరీస్ ద్వారా జాతీయ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన దర్శక ద్వయంలో ఓ డైరెక్టర్ ప్రస్తుతం ఆ స్టార్ హీరోయిన్‌తో డేటింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే వారిద్దరూ పీకల్లోతు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే విషయాన్ని మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి.
అయితే స్టార్ హీరోయిన్, డైరెక్టర్ ప్రేమాయణంలో ట్విస్టు ఏమిటంటే.. ఆ దర్శకుడు వివాహితుడు కావడమే. అయితే స్టార్ హీరోయిన్‌ను వివాహం చేసుకొనేందుకు తన భార్యతో డైవోర్స్‌కు ప్రయత్నిస్తున్నారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే దర్శకుడు తన వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకొంటున్నారు అనే విషయం ఫిలింనగర్ టాక్‌గా మారింది.

అయితే వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందా? లేదా కేవలం ప్రొఫెషనల్ బంధమేనా? అనేది ప్రశ్నలుగానే ఉన్నాయి. అయితే సదరు డైరెక్టర్, హీరోయిన్ మధ్య ప్రత్యేకమైన బంధంపై ఊహాగానాలు భారీగానే వస్తున్నాయి. అయితే వారిద్దరూ క్లారిటీ ఇస్తే ఈ వార్తలకు తెరపడుతాయంటున్నారు. అప్పటి వరకు ఈ వార్తలు ఇలానే మీడియాలో స్వైర విహారం చేయడం జరుగుతూనే ఉంటాయనేది కొత్తగా చెప్పనక్కర్లేదంటున్నారు సినీ ప్రముఖులు.


Click it and Unblock the Notifications











