పెళ్లి కాకుండానే స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. సోషల్ మీడియాలో జోరుగా రూమర్
దక్షిణాదిలో సినీ, రాజకీయ రంగంలో స్టార్ హీరోయిన్‌తో రాజకీయ నేతగా మారిన సూపర్ స్టార్ వివాహేతర బంధం ప్రకంపనలు సృష్టిస్తున్నది. సదరు స్టార్ హీరో భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం కూడా అత్యంత వివాదంగా మారింది. అయితే గత కొన్నేండ్లుగా హీరోయిన్, హీరో మధ్య రిలేషన్‌షిప్ కొనసాగుతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ.. ఏనాడు కూడా వారు తమ బంధంపై స్పందించలేదు. కానీ సదరు హీరో భార్య తన భర్తకు ఓ హీరోయిన్‌తో సహజీవనం కారణంగానే విడిపోవాల్సి వస్తుందని కోర్టు అఫిడవిట్‌లో పేర్కొనడంతో ఈ రిలేషన్‌షిప్ కొనసాగుతుందనే ఊహాగానాలకు బలం చేకూరింది.
అయితే ప్రస్తుతం రాజకీయ రంగంలో చురుకుగా ఉన్న సదరు హీరో మాత్రం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చాలా సున్నితంగా ఈ అంశాన్ని డీల్ చేస్తున్నారు. అయితే రాజకీయంగా హీరోను దెబ్బ తీసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. రకరకాల విమర్శలు, ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఒకరకమైన విధానంతో, తన మార్కు వ్యూహాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్తున్నారు.

అయితే తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలను పట్టించుకోకుండా వెళ్తున్న సమయంలో పొలిటిషియన్‌గా మారిన స్టార్ ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో ఎటాక్ ప్రారంభించారు. అయితే ఆయన ప్రతిష్టపై బురద జల్లే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో తండ్రి కాబోతున్నాడు. స్టార్ హీరోయిన్ గర్బవతి అనే పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం తమిళ ఇండస్ట్రీలోను, రాజకీయ వర్గాల్లోను భారీ చర్చకు దారి తీస్తున్నది.
తాజాగా ట్విట్టర్‌లో స్టార్ హీరో, హీరోయిన్‌పై రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇద్దరి పేర్లు బయటకు చెప్పకుండా ఆమె ప్రెగ్నెంట్. ఆయన తండ్రి కాబోతున్నాడు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై సదరు రాజకీయ పార్టీ కూడా ఆచీతూచీ వ్యవహరిస్తున్నది. అయితే హీరో వర్గం కూడా ప్రత్యర్థి పార్టీపై ఎదురు దాడి ప్రారంభించింది. ప్రత్యర్థి పార్టీ యువ నేతకు మరో హీరోయిన్‌కు ఉన్న రిలేషన్‌షిప్ రూమర్‌ను బయటకు తీస్తున్నారు. యువ నేత గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లతో సోషల్ మీడియాలో యుద్దమే జరుగుతున్నది. ఇలాంటి వార్ ఎక్కడికి దారి తీస్తుందోనని అభిమానులు, పార్టీల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదాస్పద అంశంపై హీరో, హీరోయిన్లు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications
















