49 ఏళ్ల వయసులో పెళ్లి సిద్దమైన స్టార్ హీరోయిన్.. అది కూడా టాప్ హీరోతో !

సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమలు, పెళ్లిలు, విడాకులు కామన్ అన్న విషయం తెలిసిందే. అలాగే.. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవ్వరూ ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారో.. ఎప్పుడూ ఏ జంట తమ బంధాన్ని తెంచుకుంటుందో.. చెప్పడం చాలా కష్టం. ఈ క్రమంలో కొంతమంది హీరో హీరోయిన్స్ ఐదు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉంటున్నారు. కానీ, ఓ స్టార్ హీరోయిన్ 49 ఏండ్ల వయస్సులో తన బ్యాచులర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసి.. మ్యారేజ్ లైఫ్ లో అడుగుపెట్టాలని భావిస్తున్నారట. ఇంతకీ లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కాలని భావిస్తున్న భామ ఎవరో మీరు ఓ లూక్కేయండి.

ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు. ఒకప్పుడు చిరంజీవి, బాలయ్య , నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన అందాల తార, సీనియర్ తెలుగు హీరోయిన్ నగ్మా. 90 లో నగ్మా కి ఉన్నక్రేజ్ మామాలు కాదు.. ఈ హీరోయిన్ ను చూసేందుకు యూత్ పడిచచ్చిపోయేవారు. ఈ టాలీవుడ్ బ్యూటీ వెండి తెరపై కనిపిస్తే చాలు.. కుర్రాళ్లు పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవాళ్లు. ఇక స్క్రీన్‌పై కనబడితే చాలు.. థియేటర్‌ దద్దరిల్లాల్సిందే. ఈ మూవీ నటించే సినిమాలకు కూడా యమ క్రేజ్ ఉండేది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేవి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. అనే తేడాలు లేకుండా .. అన్ని ఇండస్ట్రీలో ఈ అందాల తార.

Is star heroine nagma ready for marriage at the age of 49

వాస్తవానికి నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. ఆమె తల్లి సీమా తన మొదటి భర్తతో విడాకులు తీసుకోని, చందర్ సాధన అనే సినీ నిర్మాతను వివాహం చేసుకున్నారు. నగ్మాకు సినీ నటి జ్యోతిక, రోహిణి ఇద్దరు చెల్లెలు ఉన్నారు. తండ్రి పోత్సాహంతో సినిమాలోకి వచ్చింది. ఇలా హిందీలో భాగీ సినిమాతో నగ్మా తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా.. నగ్మా హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత తెలుగులో సుమన్ హీరోగా 'పెద్దింటి అల్లుడు' అనే సినిమాలో నటించడం.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో నగ్మ్మా వరుస ఆఫర్లు అందుకుంది.

ఈ క్రమంలో కింగ్ నాగార్జునతో కిల్లర్ సినిమాలో నటించి, మెప్పించింది. ఈ మూవీ హిట్ కావడంతో నగ్మా పాపులర్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత చిరంజీవితో 'ఘరానా మొగుడు' అనే సినిమా నటించింది. ఈ మూవీ చిరంజీవికే కాదు నగ్మా కెరీర్ కూడా ఓ మైల్ స్టోన్ గా మారిపోయింది. ఆ తర్వాత వారసుడు, అల్లరి అల్లుడు, రిక్షావోడు, భాషా, కాదలన్, భరత సింహం, సరదా బుల్లోడు లాంటి బాక్ల్ బస్టర్ సినిమాల్లో నటించి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగు లోనే కాకుండా పలు భాషలో నటించి.. స్టార్ హీరోయిన్‌గా మారారు.

అయితే.. నగ్మా ప్రొఫెషనల్ కెరీర్ ఎంతో సక్సెస్ పుల్ గా సాగిన.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ హీరోయిన్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడూ పలువురు హీరోలతో, ఓ క్రికెటర్​తో ప్రేమాయణం నడిపించినట్టు టాక్.. నగ్మా కెరీర్ లో మూడుసార్లు లవ్‌లో ఫెయిల్ అయినట్టు టాక్. తొలుత అప్పటికే పెళ్లైనా క్రికెటర్ గంగూలీతో ప్రేమాయణం సాగించింది. కొన్నాళ్లపాటు వీరిద్దరూ సహజీవనం కూడా చేశారట. సీక్రెట్ గా.. కాళహస్తిలో పూజలు కూడా చేయించుకొన్నారట. అలాగే... తిరుపతిలో మ్యారేజ్ చేసుకోవాలని భావించారట. కానీ ఈ విషయం గంగూలీ భార్యకు తెలియడంతో గొడవ చేసిందని, దీంతో పెళ్లి క్యాన్సిల్ అయిందని టాక్. దీంతో గంగూలీ టాపిక్ కు తెరపడింది.

Is star heroine nagma ready for marriage at the age of 49

ఆ తర్వాత తమిళ నటుడు శరత్ కుమార్‌కు సన్నిహితంగా ఉన్నారట. వారిద్దరి మధ్య కూడా అఫైర్ కొనసాగిందని తమిళ మీడియా కోడైకూసింది. శరత్ కుమార్ తన భార్యకు విడాకులు ఇచ్చి, నగ్మాను పెళ్లి చేసుకోవడం తప్పదని అనుకొన్నారట. దీంతో రెండవ ప్రేమ కథకు విఫలమైంది. ఆ తరువాత జోజ్ పూరి స్టార్ హీరో రవికిషన్‌తో ప్రేమాయణం కొనసాగించారనీ, కొన్నాళ్లు డేటింగ్ లో కూడా ఉన్నారని టాక్.. కానీ, రవి కిషన్ వైవాహిక జీవితం సమస్యలు రావడంతో ఈ హీరో కూడా ఆమెను పక్కన పెట్టారంట. ఇలా వరుస లవ్ ఫెల్యూర్స్ కావడంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఆమె జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నది నగ్మా.

ఆ తరువాత సినిమాలకు దూరమైన నగ్మా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా.. ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓ బాలీవుడ్ హీరోతో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారనీ, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతుందని సోషల్ మీడియాలో పలు వార్తలు హల్ చేస్తున్నాయి. అయితే.. ఈ వార్తలో నిజం ఎంతో తెలుసుకోవాలంటే.. కొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: nagma tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X