Pushpa 3 అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ ప్లాన్.. Pushpa 3 షూటింగ్ ఎప్పుడంటే?
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తమ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప సృష్టించిన సునామీతో అల్లు అర్జున్ స్టార్ డమ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. పుష్ప అందించిన విజయంతో పుష్ప 2 (పుష్ప ది రూల్ బిగిన్స్) అనే చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకోబోతున్నది. ఇప్పటికే పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో అంచనాలు పెరుగుతుంటే.. యూనిట్ పుష్ప3 సినిమాకు భారీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..
పుష్ప 2 సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజై సునామీని సృష్టించింది. అల్లు అర్జున్ మేకోవర్ మరోసారి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఐకాన్ స్టార్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. టీజర్‌లో అల్లు అర్జున్ ఎంట్రీ మాస్ ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది.

ఇలా పుష్ప 2 అంచనాలతో టాప్ రేపుతుండగానే.. పుష్ప 3 మూవీ గురించి మీడియాలో లీకులు మొదలయ్యాయి. ఈ చిత్రం షూటింగ్ ఫుష్ప ది రూల్ తో మొదలవుతుందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
పుష్ప ది రూల్ సినిమా కథ విషయానికి వస్తే.. చైనాలో ఉండే విలన్‌ను, పుష్పరాజ్‌కు మధ్య జరిగే వార్ నేపథ్యంలో సాగుతుందని మీడియాలో ఓ వార్త వినిపిస్తున్నది. చైనా నేపథ్యంగా ఈ సినిమా కథ ఉంటుందనే వార్త మీడియాలో వైరల్ అయింది. అయితే పుష్ప3 గురించి సుకుమార్ గానీ, ప్రొడక్షన్ హౌస్ గానీ వివరణ ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై క్లారిటీ మిస్ అవుతున్నది.

అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన తదుపని సినిమాను సందీప్ రెడ్డి వంగాతో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా పూర్తియిన తర్వాత అంటే.. 2025లో పుష్ప 3 షూటింగ్ మొదలు అవుతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. పుష్ప 2 తర్వాత మరో పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సిద్దమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











