సురేంద్రరెడ్డి, రామ్ ల కాంబినేషన్ కాన్సిల్..కారణం
సురేంద్రరెడ్డి, రామ్ ల కాంబినేషన్లో రామ్ అండ్ జెన్నీ అనే చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే కథ అద్బుతంగా కుదిరిందని,క్యారెక్టర్ అదిరిందని ఓపినింగ్ రోజున ఊదరకొట్టారు. కానీ కథ ఇంకా ఓ కొలిక్క రాకపోవటంతో మండిపడ్డ స్రవంతి రవికిషోర్ ఈ ప్రాజెక్టుకు మంగళం పాడినట్లు చెప్తున్నారు. ఊసరివిల్లి, టామ్ అండ్ జెర్రి అనే టైటిల్ లతో కొంతకాలం కాలం గడిపిన సురేంద్రరెడ్డి..స్రవంతి రూల్ ప్రకారం బౌండ్ స్క్రిప్టు సబ్మిట్ చేయకపోవటమే కారణమంటున్నారు. ఇక రామ్..కరుణాకరన్ దర్శకత్వంలో బిజీగా ఉండగా, సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రానికి ఓ పెద్ద హీరోతో ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదైమైనా కిక్ హిట్ ని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయాడని అంతా అంటున్నారు.


Click it and Unblock the Notifications











