ఓ లవర్‌కు బ్రేకప్.. మరో ప్రియుడితో సుస్మిత సేన్ పెళ్లి.. ఐపీఎల్ లీడర్‌తో సీక్రెట్ మ్యారేజ్!
మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ లైఫ్‌లో ఎన్నో మలుపులు, ట్విస్టులతో సాగుతున్నది. దాదాపు 50 ఏళ్ల వయసులో ఇంకా ఒంటరి జీవితం గడుపుతూనే ఉంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఇంకా టాప్ రేంజ్‌లో ఉన్న ముద్దుగుమ్మకు పలువురితో అఫైర్, బ్రేకప్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల పెళ్లికి సిద్దమైన సుస్మిత సేన్ మాట్లాడుతూ.. నా జీవితం తెరిచిన పుస్తకమే.. అందులో దాచాల్సిన విషయాలు ఏమీ లేవు అంటూ కామెంట్ చేసింది. అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ అందాల తార జీవితం గురించిన విషయాల్లోకి వెళితే..
హిందీ సినిమా పరిశ్రమలో స్టార్ స్టేటస్, నిగనిగలాడే అందం, వయసుతో ఉన్న సమయంలో ఆమె ప్రేమ వ్యవహారాలు జాతీయ మీడియాలో హైలెట్‌గా మారాయి. పెళ్లి వరకు వచ్చిన అఫైర్లు మధ్యలోనే బ్రేకప్ అయ్యాయి. ఈ విషయంపై చాలా మంది తనను మోసగించారని పలు సందర్భాల్లో చెప్పారు. అందుకే నేను పెళ్లి చేసుకోలేకపోయానని చెప్పారు.

అయితే ఇటీవల కాలంలో ఆమె ఇద్దరితో సంబంధాలను కొనసాగిస్తున్నది. అందులో ఒకరు రోహ్మన్ షాల్ అయితే.. మరొకరు ఐపీఎల్ రూపకర్త లలిత్ మోడీ. ఇద్దరితో అఫైర్ కొనసాగించడం మిస్టరీగా మారింది. అయితే వీరిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకొంటుందనే విషయంపై ఎవరూ చెప్పలేని సందేహాలను రేకెత్తించింది.
ఇక కొద్ది నెలల క్రితం లండన్‌లో లలిత్ మోడీతో సన్నిహితంగా సమయాన్ని గడుపుతున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. తాము ఇద్దరు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నామని వారు బహిరంగ ప్రకటన చేశారు. ఐపీఎల్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిని సుస్మిత కలవడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది.

అయితే రోహ్మన్ షాల్‌కు సుస్మిత బ్రేకప్ చెప్పి.. ప్రస్తుతం లలిత్ మోడీతో పెళ్లి చేసుకోబోతున్నది. వారిద్దరి వివాహం లండన్‌లోని రిసార్టులో జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వివాహ తేదీలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే మ్యారేజ్ డేట్ బయటకు వెల్లడించే అవకాశం ఉంది.
బాలీవుడ్ చిత్రాలకు కొంత విరామం ప్రకటించిన సుస్మిత సేన్.. ఇటీవల ఆర్య వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకు చేరువైంది. కొన్ని సినిమాలు, అలాగే వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమా షూటింగులకు హాజరవుతున్నారు. అయితే లలిత్ మోడీని పెళ్లి చేసుకొంటే ఆమె మకాం లండన్‌కు మారే అవకాశం ఉందని సినీ పండితులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











