ఎట్టకేలకు సుస్మిత సేన్ పెళ్లి.. విశ్వసుందరికి కాబోయే భర్త ఎవరంటే!
నాలుగు పదులు వయస్సులో పడినా ఇంకా నవనవలాడుతున్న విశ్వసుందరి సుస్మితసేన్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఫ్యాన్స్ ఎదురుచూపులకు త్వరలోనే తెరపడే అవకాశం ఉందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో గుప్పుమన్నాయి. కొద్దికాలంగా పీకల్లోతు మునిగిన సుస్మితసేన్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు వార్తల సారాంశం. ఇక సుస్మిత మనసులో ప్రేమ ఎలా చిగురించిందంటే..

ముంబై ఫ్యాషన్ వీక్‌లో
కొద్దినెలల క్రితం ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ వీక్ సుస్మిత సేన్ తన ప్రియుడు రోహ్మాన్ షాకు పరిచయం జరిగింది. ఆ పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇక ఇప్పుడు పెళ్లి పీటల దాకా వచ్చింది.

రోహ్మన్ చేసిన ప్రపోజల్‌తో
సుస్మిత మదిలో స్థానం సంపాదించుకోవడానికి రోహ్మన్ చేసిన ప్రపోజల్ ఆసక్తిగా మారింది. ఓ రోజు మోకాళ్లపై కూర్చొని మనస్పూర్తిగా సుస్మితకు తన మనసులోని ప్రేమను వ్యక్తీకరించాడు. దాంతో సుస్మిత వైపు నుంచి అంగీకారం వచ్చేసింది. ఆ తర్వాత లేటు చేయకుండా తమ బంధాన్ని ప్రపంచానికి చాటారు.

రెండు నెలలుగా డేటింగ్‌తో
సుస్మిత సేన్, రోహ్మన్ రెండు నెలలుగా డేటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే వారు పెళ్లి చేసుకోవాలని ఓ అవగాహనకు వచ్చారు. ప్రస్తుతం అనుకొన్న ప్లాన్ వర్కవుట్ అయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో పెళ్లి జరిగే అవకాశం ఉంది.

అంతా సవ్యంగా జరిగితే 2019లో
ప్రస్తుతం పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎక్కడ జరిపించాలి. మూడు మూళ్లు పడటానికి ప్రదేశం ఎంపిక గురించి పలు విధాలుగా చర్చిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే 2019 శీతాకాలంలో పెళ్లి జరిగే అవకాశం ఉంది అని సుస్మిత సన్నిహితులు వెల్లడించారు.

కూతుళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్
సుస్మితకు పెంపుడు కూతుళ్లు రీనీ, అలీషా అంటే చెప్పలేనంత ఇష్టం. వారిని ప్రాణంగా చూసుకొంటారు. అయితే అలాంటి కూతుళ్ల నుంచి కూడా సుస్మితకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దాంతో సుస్మిత రోహాన్ పెళ్లికి లైన్ క్లియర్ లభించడానికి అదో కారణం కూడా.


Click it and Unblock the Notifications











